ఘనంగా శ్రావణ శుక్రవార పూజలు
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:44 AM
శ్రావణమాసం చివరి శక్రవారం కావడంతో రాజమహేంద్రవరంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు, వ్రతాలు జరిపించారు. స్థా నిక శ్రీవెంకటేశ్వర జనరల్ మార్కెట్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. దేవీచౌక్ శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారు, వంకాయలవారి వీఽధి లోని శ్రీఅష్టలక్ష్మి అమ్మవారు, రంగ్రీజుపేటలో ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు పూజలు, వ్రతాలు చేసుకున్నారు.
రాజమహేంద్రవరం కల్చరల్/గోకవరం/రాజానగరం, ఆగస్టు30: శ్రావణమాసం చివరి శక్రవారం కావడంతో రాజమహేంద్రవరంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు పూజలు, వ్రతాలు జరిపించారు. స్థా నిక శ్రీవెంకటేశ్వర జనరల్ మార్కెట్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. దేవీచౌక్ శ్రీ బాలత్రిపురసుందరి అమ్మవారు, వంకాయలవారి వీఽధి లోని శ్రీఅష్టలక్ష్మి అమ్మవారు, రంగ్రీజుపేటలో ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు పూజలు, వ్రతాలు చేసుకున్నారు. గోకవరం మండలం తంటికొండ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటే శ్వరస్వామి సన్నిధిలో శుక్రవారం ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. దేవస్థానం మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర, సువర్ణతులసి దంపతులతో వరలక్ష్మివ్రత పూజ ప్రారంభించగా సుమారు 500మంది మహిళలు వ్రతంలో పాల్గొని పూజలు చేశారు. అలాగే రాజానగరం మండలంలోని రాజానగరంలోని రావులచెరువు గట్టుపై రామాలయంలో కొలువుతీరిన మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ పురోహితులు సాయి ఆధ్వర్యంలో సహస్ర నామ సామూహిక కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణం చేపట్టారు. అలాగే ముక్కినాడలోని శ్రీసాయిబాబా మందిర ప్రాంగణంలో చేపట్టిన సామూహిక కుంకుమ పూజా క్రతువులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 07:07 AM