గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించాలి
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:25 AM
గ్రామ, మండల స్థాయిలో ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
మండపేట, అక్టోబరు 7: గ్రామ, మండల స్థాయిలో ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. మొత్తం 125 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని ఆన్‌లైన్ చేసి త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగుల వద్దకు నేరుగా కలెక్టర్ వెళ్లి అర్జీ స్వీకరించారు. దివ్యాంగు సంక్షేమ సంఘం నాయకుడు నందికోళ్ల రాజు పలు సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. కాంగ్రెస్ నాయకుడు కామన ప్రభాకరరావు మండపేట ఏడిద రోడ్డు దుస్థితిని వివరించారు. మండపేట పట్టణానికి చెందిన ముస్లింలు కలెక్టర్‌ను కలిసి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరారు మండపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులు విడుదల చేసిందని వాటితో త్వరలోనే రహదారులకు మరమ్మతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాజబాబు, రామచంద్రపురం ఆర్డీవో ఖాతీబ్ కౌసర్ బానో, మండపేట మున్సిపల్ కమిషనర్ రంగారావు ఏడిద సర్పంచ్ బూరిగ అశీర్వాదం, డీఎల్‌డీవో శాంతి, ఎంపీడీవో సత్యనారాయణమూర్తి, తహసీల్దార్ తేజేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, మండపేట రూరల్ సీఐ దొరరాజు, పట్టణ ఎస్‌ఐ హరికోటిశాస్త్రి పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 12:25 AM