ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నవంబరు 4న గోదారమ్మకు కార్తీక హారతి

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:55 AM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదారమ్మకు కార్తీకహారతి ఇవ్వనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

కొవ్వూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదారమ్మకు కార్తీకహారతి ఇవ్వనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం రాత్రి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో గోదావరి హారతిపై సమావేశం జరిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 4న సాయం త్రం గోదావరికి పలు హారతులు ఇస్తారన్నారు. ఆర్డీవో రాణి సుశ్మిత మాట్లాడుతూ గోదావరి హారతికి శాఖలవారీగా కేటాయించిన ఏర్పాట్లు పటిష్టవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి 10 వేల మందికి పైగా వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హారతిని తిలకించే వారికి ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎం. దుర్గాప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, ఏజిఆర్‌బి ఏఈ జి.మణికంటరాజు, పట్టణ ిసీఐ పి.విశ్వం, కె. విజయబాబు, రోహిణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:55 AM