హెల్త్ వెల్‌నెస్ సెంటర్‌ల తనిఖీ
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:09 AM
కడియం హెల్త్‌వెల్‌నెస్ సెంటర్-1 ను హెల్త్ వెల్‌నెస్‌సెంటర్-3లను బుధవారం జిల్లా ఎయిడ్స్ లెప్రసీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఎన్.వసుంధర తనిఖీ చేశారు. ఈ హెల్త్ వెల్‌నెస్ సెంటర్ పరిధిలో ఉన్న టీబీ, లెప్రసీ కేసులు, రోగులకు అందుతున్న సేవలను గూర్చి సిబ్బందిని అడిగారు.
కడియం, సెప్టెంబరు 4: కడియం హెల్త్‌వెల్‌నెస్ సెంటర్-1 ను హెల్త్ వెల్‌నెస్‌సెంటర్-3లను బుధవారం జిల్లా ఎయిడ్స్ లెప్రసీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఎన్.వసుంధర తనిఖీ చేశారు. ఈ హెల్త్ వెల్‌నెస్ సెంటర్ పరిధిలో ఉన్న టీబీ, లెప్రసీ కేసులు, రోగులకు అందుతున్న సేవలను గూర్చి సిబ్బందిని అడిగారు. టీబీ వ్యాధిగ్రస్థులకు అందించాల్సిన వైద్యం గురించి సిబ్బందికి సూచించారు అనుమానస్పద లెప్రసీ కేసులు గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం సూపర్‌వైజర్ సుందరి, కడియం టీబీ యూనిట్ సూపర్‌వైజర్ శేషు, విల్సన్‌పాల్, ఎంఎల్‌హెచ్‌పీలు వినీల, శాంతిప్రియ, ఏఎన్‌ఎం లు బి సునీత, వి సునీత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలంతా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి : వైద్యురాలు ఏంజెల్
రాజానగరం, సెప్టెంబరు 4: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యం భారి నుంచి కాపాడుకోవచ్చని రాజానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ ఏజెంల్ సూచించారు. మండలంలోని ముక్కినాడపాకలులో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఎన్‌వీవీ రమణ, ఏఎన్‌ఎం జీవన్ జ్యోతి, ఆశ పాల్గొన్నారు.
కుటుంబ నియంత్రణ ఆఫరేషన్లు...
రాజానగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం నిర్వహించినట్లు పీహెచ్‌సీ వైద్యాధికా రులు డాక్టర్ గట్టి రామభాస్కర్, డాక్టర్ సీహెచ్ వెంకటలక్ష్మి తెలిపారు. దీనిలో భాగంగా తమ పీహెచ్‌సీలో ఐదుగురికి క్యూబెక్టమీ ఆఫరేషన్లు నిర్వహించామన్నారు.
వైరల్ జ్వరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుమతీదేవి
అనపర్తి, సెప్టెంబరు 4 : ప్రస్తుతం విస్తరిస్తున్న వైరల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామవరం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ సుమతీదేవి అన్నారు. బుధవారం అనపర్తిలోని రజక కళ్యాణ మండపంలో నిర్వహించిన వైద్యశిబిరంలో రోగులకు బీపీ, షుగర్ పరీ క్షలతో పాటు మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. అవసర మైన రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సుమారు 100మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఈ శిబిరంలో డాకర్ మీనాక్షి, హెచ్‌వీ లక్ష్మి, ఎమ్‌పిహెచ్‌ఏ దివాకర్, సిహెచ్‌వో నిర్మల, ఏఎన్‌ఎమ్ చంద్ర, ఆశా వర్కర్లు నీలిమ, మణి, రాజకుమారి, అనూరాధ, విజయ తదితరులు సేవలందించారు.
Updated Date - Sep 05 , 2024 | 01:09 AM