ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు వైష్ణవ్‌తేజ్‌ ప్రచారం

ABN, Publish Date - May 01 , 2024 | 12:38 AM

పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో బుధవారం ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్‌ తేజ్‌ పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ కొత్తపల్లి మండలాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, జనసేన నాయకులు డాక్టర్‌ జ్యోతుల శ్రీనివాస్‌, మత్సా అప్పాజీ, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

కొత్తపల్లి, ఏప్రిల్‌ 30: పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో బుధవారం ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్‌ తేజ్‌ పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ కొత్తపల్లి మండలాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, జనసేన నాయకులు డాక్టర్‌ జ్యోతుల శ్రీనివాస్‌, మత్సా అప్పాజీ, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కొత్తపల్లి సురక్ష ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రోడ్డు షో వివరాలను తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నవఖండ్రవాడ నుంచి వైష్ణవ్‌ తేజ్‌ రోడ్డుషో ప్రారంభిస్తారన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం కొండెవరం, ఇసుకపల్లి మీ దుగా నాగులాపల్లి, రమణక్కపేట, రామరాఘవపురం, ముమ్మిడివారిపోడులో పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారన్నారు. అనంతరం శ్రీరాంపురం నుంచి కోనపాపపేట, శీలంవారిపాలెం మీదుగా మూలపేట సెజ్‌ కాలనీ చేరుకుంటారని చెప్పారు. అక్కడ నుంచి మూలపేట సెంటర్‌లో రోడ్డుషోలో ప్రసంగిస్తారన్నారు. రామన్నపాలెం, అమీనాబాద్‌ సెంటర్‌ నుంచి యండపల్లి ఎస్సీ పేట, యండపల్లి జంక్షన్‌,కొత్తపల్లి మీదుగా ఉప్పాడ బీచ్‌రోడ్‌ సెంటర్లో రోడ్‌షోలో ప్రచారం నిర్వహిస్తారని, భారీగా ప్రజలు తరలిరావాలని కోరారు. గవర రాంబాబు, మురాలశెట్టి సునీల్‌కుమార్‌, కంబాల దాసు, గుండా అప్పారావు, గవర నాగేశ్వరరావు తదితర టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:38 AM

Advertising
Advertising