వసతి గృహాల విద్యార్థులకు గోల్డెన్ అవర్ బీమా
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:10 AM
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా వసతి గృహాల విద్యార్థులందరికీ గోల్డెన్ అవర్ బీమా సదుపాయం కల్పించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథాశ్రమాలు, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులందరికీ ఈ బీమా సదుపాయం వర్తింపచేస్తామన్నారు.
అమలాపురం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా వసతి గృహాల విద్యార్థులందరికీ గోల్డెన్ అవర్ బీమా సదుపాయం కల్పించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలు, అనాథాశ్రమాలు, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులందరికీ ఈ బీమా సదుపాయం వర్తింపచేస్తామన్నారు. విద్యార్థికి ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్‌లో వినియోగించుకునేలా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు హెల్త్ ఇన్సూరెన్సు కల్పిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ ఇన్సూరెన్సు కంపెనీలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్ర్తీ,శిశుసంక్షేమశాఖ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాము కాట్లు, ఫుడ్ పాయిజన్ వంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్న నేపథ్యంలో సంబంధిత సంక్షేమ అధికారులు హెచ్‌ఎంలు వారి సొంత నిధులు చెల్లించకుండా హెల్త్ ఇన్సూరెన్సు కవరేజ్ కోసం ఐసీఐసీఐ లాంబర్డ్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతీ ఆసుపత్రి వద్ద సీసీ కెమెరాలు అమర్చి వాటిని కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి స్టోరేజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రుల డేటాలను ఆయా పరిధిలోని పోలీసుస్టేషన్లకు మ్యాపింగ్ చేయాలన్నారు. ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో అన్ని అత్యవసర వైద్యసేవలు మ్యాపింగ్ కూడా ప్రత్యేకంగా రూపొందించాలన్నారు. సీసీ కెమెరాలు నిత్యం పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఐఎంఏ సభ్యులు డాక్టర్ మూర్తి, డాక్టర్ శర్మ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కార్తీక్, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర, సాంఘిక సంక్షేమశాఖ డీడీ పి.జ్యోతిలక్ష్మీదేవి, ఐసీడీఎస్ అధికారులు విజయశ్రీ, రమణి, ఉమాలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - Sep 27 , 2024 | 12:10 AM