ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి!

ABN, Publish Date - May 20 , 2024 | 11:38 PM

వంద కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న సీతానగరం -రాజమహేంద్రవరం 4 లైన్ల రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు నత్తనడక సాగుతున్నాయి.

డివైడర్‌ కోసం వదిలేసిన గాడి

  • అసంపూర్తిగా నిలిచిన కల్వర్టుల పనులు

  • ఇప్పటి వరకు ఆరు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

సీతానగరం, మే 20: వంద కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న సీతానగరం -రాజమహేంద్రవరం 4 లైన్ల రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు నత్తనడక సాగుతున్నాయి. ఇప్పటికే ఈ రోడ్డులో ఆరు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృతిచెందారు. మండలంలోని రాపాక తూరలు వద్ద, రఘుదేవపురం వద్ద రెండు కల్వర్టులు ఈ రోడ్డులోనే నిర్మిస్తున్నారు. ఈ రెండూ అసంపూర్తిగా ఉండడంతో ఏ విధమైన హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చే వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా కాంట్రాక్టర్లు గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదు. 4 లైన్ల రోడ్డు కావడంతో రోడ్డు మధ్యలో వేసే డివైడర్‌ కొన్నిచోట్ల వేయకపోవడంతో మధ్యలో ఉన్న గాడి ప్రమాదాలకు కారణమవుతోంది. ఏ మాత్రం ఆదమర్చినా ప్రమాదం జరుగుతోంది. దీంతో ఈ రోడ్డు పనులు పూర్తయ్యే సరికి ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 20 , 2024 | 11:38 PM

Advertising
Advertising