ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

83 సాగునీటి సంఘాల ఏర్పాటు

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:18 AM

జిల్లాలో 83 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటయ్యాయని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ శనివారం తెలిపారు. జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యాయన్నారు.

అమలాపురం రూరల్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 83 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటయ్యాయని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ శనివారం తెలిపారు. జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యాయన్నారు. గోదావరి మధ్య డెల్టా, తూర్పు డెల్టాలో మొత్తం 990 ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు లేని కారణంగా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. మిగిలిన 983 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించామన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి కావడంతో రైతులకు గతంలో మాదిరిగా సకాలంలో సాగునీరు అందించే పర్యవేక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. సాగునీటి సరఫరా, కాల్వల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగి శివారు ప్రాంత భూములకు సైతం సాగునీరు అందించేలా పర్యవేక్షణ చేసేందుకు సాగునీటి సంఘాలు దోహదపడతాయన్నారు. ఒక్కో సంఘం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ కూడా పూర్తి అయిందన్నారు. రైతు సంక్షేమమే పరమావధిగా ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి శివారు ప్రాంతాలకు సైతం సాగునీటి సజావుగా పారే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించిందని కలెక్టర్‌ తెలిపారు. ఈ నెల 17న డిస్ర్టిబ్యూషన్‌ కమిటీకి ఎన్నిక నిర్వహిస్తామన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:18 AM