డీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:37 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 15 డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. డిస్ర్టిబ్యూటరీ కమిటీ పరిధిలోకి వచ్చే సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తొలుత డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత కమిటీ వైస్ చైర్మన్‌ను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఎన్నికల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల ఆర్వో, ఏఆర్వోలను
నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
అమలాపురం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 15 డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. డిస్ర్టిబ్యూటరీ కమిటీ పరిధిలోకి వచ్చే సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తొలుత డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత కమిటీ వైస్ చైర్మన్‌ను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఎన్నికల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. డీసీల ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పోలీసులను కోరారు. దాంతో మంగళవారం జరిగే డీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి నేతలు దృష్టి సారించారు. కొన్నిచోట్ల పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు నేతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఎన్నికల అధికారుల నియామకం..
జిల్లాలో మంగళవారం జరిగే డిస్ర్టిబ్యూటరీ కమిటీల ఎన్నికలకు ఎన్నికల అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాలపురం డీసీకి కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్ ఎన్నికల అధికారిగాను, ఆత్రేయపురం తహశీల్దార్ పి.రాజేశ్వరరావును అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగాను నియమించారు. అవిడి డీసీకి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కె.వెంకట్రావు ఆర్వోగాను, ఏఆర్వోగా కొత్తపేట తహశీల్దార్ వై.రాంబాబును నియమించారు. అమలాపురం డీసీకి ఆర్డీవో కె.మాధవి ఆర్వోగాను, తహశీల్దార్ జీడీ కిశోర్‌బాబు ఏఆర్వోగాను, అల్లవరం డీసీకి జిల్లా పంచాయతీ అధికారి డి.శాంతలక్ష్మి ఆర్వోగాను, అల్లవరం తహశీల్దార్ వీవీఎల్ నరసింహారావు ఏఆర్వోగాను, మురమళ్ల డీసీకి ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి ఆర్వోగాను, ఐ.పోలవరం తహశీల్దార్ సీహెచ్ విజయశ్రీ ఏఆర్వోగాను, కాట్రేనికోన డీసీకి ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీరాణి ఆర్వోగాను, కాట్రేనికోన తహశీల్దార్ పి.సునీల్‌కుమార్ ఏఆర్వోగాను, పి.గన్నవరం డీసీకి జడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు ఆర్వోగాను, తహశీల్దార్ పి.శ్రీపల్లవి ఏఆర్వోగాను, అయినవిల్లి డీసీకి డిప్యూటీ కలెక్టర్ వి.మదన్మోహన్ ఆర్వోగాను, అయినవిల్లి తహశీల్దార్ సీహెచ్ నాగలక్ష్మమ్మ ఏఆర్వోగాను, రాజోలు డీసీకి డీఆర్డీఏ పీడీ వి.శివశంకరప్రసాద్ ఆర్వోగాను, రాజోలు తహశీల్దార్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్ ఏఆర్వోగాను నియమితులయ్యారు. అదేవిధంగా ఎర్రపోతవరం డీసీకి సమగ్రశిక్ష ఏపీసీ ఎ.మధుసూదనరావు ఆర్వోగాను, కపిలేశ్వరపురం తహశీల్దార్ సీహెచ్ చిన్నారావు ఏఆర్వోగాను, రామచంద్రపురం డీసీకి ఆర్డీవో ఆర్వోగాను, రామచంద్రపురం తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు ఏఆర్వోగాను, కూళ్ల డీసీకి ఆర్‌అండ్‌బీ ఈఈ బి.రాము ఆర్వోగాను, కపిలేశ్వరపురం డిప్యూటీ తహశీల్దార్ కె.జానకిరామయ్య ఏఆర్వోగాను, కోటిపల్లి డీసీకి జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎస్.మురళీకృష్ణ ఆర్వోగాను, తహశీల్దార్ బి.మృత్యుంజయరావు ఏఆర్వోగాను, ఆలమూరు డీసీకి డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ ఆర్వోగాను, ఆలమూరు తహశీల్దార్ కేజే ప్రకాష్‌బాబును ఏఆర్వోగాను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బోసుబాబును, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి.వెంకటేశ్వర్లును రిజర్వు స్టాఫ్‌గా నియమించారు. కాగా 15వ డీసీగా కొత్తగా ఉప్పలగుప్తం డీసీని ఏర్పాటు చేశారు.
డిస్ర్టిబ్యూటరీ కమిటీ సభ్యుల
ఎన్నిక జరిగేది ఇలా..
మండలాల వారీగా నిర్దేశించిన ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 9 గంటలకు డిస్ర్టిబ్యూటరీ కమిటీ అధ్యక్ష స్థానానికి నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం 15 నిమిషాల సమయాన్ని కేటాయించారు. 9.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఏకగ్రీవం కాని పక్షంలో 9.30 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం 10.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తారు. అనంతరం డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షుడి ఎన్నిక ప్రారంభిస్తారు. 11 గంటల నుంచి 11.15 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11.30 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఏకగ్రీవం కాని పక్షంలో 11.30 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం 12.15 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను పూర్తిచేసి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన వారి పేర్లను ప్రకటిస్తారు.
Updated Date - Dec 17 , 2024 | 12:37 AM