విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:12 AM
కాకినాడ సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం చేస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్నాథపురం అన్నవరం సత్యదేవ ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం ఆదికవి నన్న య్య విశ్వవిద్యాలయం పరిధిలో తైక్వాండో
కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు
కాకినాడ సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం చేస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్నాథపురం అన్నవరం సత్యదేవ ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం ఆదికవి నన్న య్య విశ్వవిద్యాలయం పరిధిలో తైక్వాండో మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడలో జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నా రని, క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉన్న త లక్ష్యాలను సాధించి స్థిరపడాలన్నారు. గతంలో తైక్వాండో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా ఉండేదికాదని, ఇప్పుడు తైక్వాండో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కేటాయ్తిన్నారన్నారు. రూ.66కోట్లతో కాకినాడ జగన్నాథపురంలో నూతనంగా స్టేడియం నిర్మాణం చేపట్టనున్నామ న్నారు. ప్రిన్సిపాల్ వి.అనంతలక్ష్మి, వైస్ ప్రిన్సి పాల్ ఎం.సువర్చల, ఆదికవి నన్నయ్య యూని వర్సిటీ అబ్జర్వర్ వర్మ మాట్లాడారు. ఐక్యూ కోఆర్డినేటర్ వసంతలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ పరిమ ళారాణి, కోచ్ లక్ష్మణ్, చింతా సతీష్ పాల్గొన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 12:12 AM