పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:24 AM
తాళ్లరేవు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చొల్లం గి గురుకుల పాఠశాల, తాళ్లరేవు ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారంఆసుపత్రిలో వార్డుల్లో ఉన్న మరుగుదొడ్లును పరిశీలించి పారిశుధ్యం సరిగా లేకపోవడంతో సూపరింటిండెంట్ డాక్టర్ స్నేహలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెలరోజుల్లో మళ్లీ ఆసుపత్రికి వస్తానని, అప్పటిలోగా పారిశుధ్య చర్యలు మెరుగుపరచి రో
చొల్లంగి గురుకుల పాఠశాల, తాళ్లరేవు ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్
తాళ్లరేవు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చొల్లం గి గురుకుల పాఠశాల, తాళ్లరేవు ఆసుపత్రిలో పారిశుధ్య చర్యలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారంఆసుపత్రిలో వార్డుల్లో ఉన్న మరుగుదొడ్లును పరిశీలించి పారిశుధ్యం సరిగా లేకపోవడంతో సూపరింటిండెంట్ డాక్టర్ స్నేహలతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెలరోజుల్లో మళ్లీ ఆసుపత్రికి వస్తానని, అప్పటిలోగా పారిశుధ్య చర్యలు మెరుగుపరచి రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని స్నేహలతను ఆదేశించారు. ఆసుపత్రిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణపనులను సకాలంలో పూర్తిచేసి బయటకు వెళ్లాలని కాం ట్రాక్టరును ఆదేశించారు. డెలివరీలు ఇక్కడ చే యకుండా కేసులను కాకినాడ ఆసుపత్రికి తరలించేస్తున్నారని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తక్షణం వైద్యులను నియమించే చర్యలు చేపడతానని, రోగులకు మెరుగైన వైద్యసేవలను అంది ంచాలని తెలిపారు. చొల్లంగి గురుకులంలో పాఠశాల ఆవరణలో గోతులను పూడ్చాలని, డ్రైనేజీలు నిర్మించాలని, సిమెంటు రోడ్డు నిర్మాణం చేయాలని ప్రిన్సిపాల్ పద్మావతి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ స్వప్న, ఆసుపత్రి డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:24 AM