దర్జాగా దందా
ABN, Publish Date - Nov 28 , 2024 | 12:49 AM
కాకినాడ నుంచి కళ్లుగప్పి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తోన్న దందాపై అధికా రులు మళ్లీ పంజా విసిరారు. ఈసారి నేరుగా సముద్రంలోకి వెళ్లి నౌకలో తనిఖీలు చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించడానికి రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. ఎన్నో ఏళ్లుగా కాకినాడ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతున్నా తొలిసారి తనిఖీల కోసం ఏకంగా నడిసముద్రంలో లంగరేసిన నౌకలో తనిఖీలు చేపట్టడం విశేషం.
విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతిపై మళ్లీ పంజా
ఈసారి నడిసముద్రంలో నౌకలోకి వెళ్లి మరీ తనిఖీలు చేసిన కలెక్టర్
ఇన్నేళ్లలో తొలిసారి నౌకలో ఆకస్మిక దాడులతో అక్రమార్కుల్లో కలవరం
38వేల టన్నుల బియ్యంలో 640టన్నుల రేషన్ బియ్యం గుర్తింపు
ఎగుమతికి సిద్ధంగా ఉన్న లవన్ షిప్పింగ్ బార్జిపైనా బుధవారం రాత్రి దాడులు
1,060 మె.ట. రేషన్ బియ్యం గుర్తింపు.. ఇటీవల బీజీతో 750మె.ట బియ్యం రిలీజ్
750మెట్రిక్ టన్నులు కాస్తా 1,060కి పెరగడంపై అధికారుల్లో అనుమానాలు
విదేశాలకు రేషన్‌బియ్యం దందా నిగ్గు తేల్చకపోవడంపై ఇటీవల సీఎం సీరియస్
ఈ నేపథ్యంలో వరుస దాడులతో ఉక్కు పిడికిలి బిగించిన అధికారులు
కాకినాడ నుంచి కళ్లుగప్పి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తోన్న దందాపై అధికా రులు మళ్లీ పంజా విసిరారు. ఈసారి నేరుగా సముద్రంలోకి వెళ్లి నౌకలో తనిఖీలు చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించడానికి రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. ఎన్నో ఏళ్లుగా కాకినాడ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జరుగుతున్నా తొలిసారి తనిఖీల కోసం ఏకంగా నడిసముద్రంలో లంగరేసిన నౌకలో తనిఖీలు చేపట్టడం విశేషం.
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
కాకినాడ నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్‌బియ్యం దందాపై ఇప్పటివరకు బాధ్యులను గుర్తించకపోవడంపై సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను నిలదీశారు. దీంతో మళ్లీ ఇప్పుడు అధికారులు పంజావిసరడం మొదలుపెట్టారు. అటు ఎగుమతికి సిద్ధంగా ఉన్న లవన్ షిప్పింగ్ కంపెనీ బియ్యం ఎగుమతులపైనా బుధవారం రాత్రి దాడులు చేయగా అందులోను వెయ్యి మె ట్రిక్ టన్నులకుపైగా రేషన్ బియ్యం గుర్తిం చా రు. ఇటీవల ఈ సంస్థ నుంచి సీజ్ చేసిన బి య్యాన్ని బీజీ ద్వారా అధికారులు విడుదల చేయగా, అదే బియ్యాన్ని తిరిగి గుట్టుగా విదేశా లకు తరలించేస్తున్నట్లు గుర్తించారు. మరోపక్క సివిల్ సప్లై ఛైర్మన్ తోట సుధీర్ సైతం మంగళ వారం కొన్ని గోదాముల్లో తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కులకు ఊపిరాడడం లేదు.
అసలు దోషులింకా దొరికితేగా..
కాకినాడకేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం గత వైసీపీ ఐదేళ్లపాలనలో లెక్కకు మిక్కిలి ఎగు మతి అయింది. రేషన్ బియ్యాన్ని కారుచౌకగా కొని పాలిష్ చేసి ఎగుమతి చేస్తూ గత ప్రభు త్వంలో కాకినాడ వైసీపీ కీలక నేత ఆయన అను చరులు వందల కోట్లు సంపాదించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దందాను అరికట్టడానికి రంగంలోకి దిగింది. స్వయంగా పౌరసరఫరాల శాఖ మంత్రి సైతం పోర్టు సమీపంలోని గోదా ముల్లో తనిఖీలు చేశారు. రేషన్‌బియ్యం దారి మ ళ్లకుండా కాకినాడ పోర్టుకు వెళ్లే దారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా అక్రమార్కు లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కొన్ని మిల్లుల్లో బియ్యాన్ని పాలిష్ చేసి ఆఫ్రికా దే శాలకు ఎగుమతి చేస్తున్నారు. పోర్టువద్ద ఏర్పా టు చేసిన చెక్‌పోస్టులు మినహా మిల్లులవద్ద నిఘా లేకపోవడం ఇప్పటికీ రేషన్ బియ్యం ఎగు మతి దందాదారులకు కలిసి వస్తోంది. మరోపక్క ఈ ఐదేళ్లలో సాగిన బియ్యం దందాకు బాధ్యుల ను ఇప్పటికీ అధికారులు గుర్తించలేదు. కేసును సీఐడీ ద్వారా విచారణ చేయిస్తామన్నా ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. దీంతో ఇటీవల సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో చోటుచేసు కున్న దందాలపై సమీక్ష సందర్భంగా కాకినాడ నుంచి అక్రమ బియ్యం ఎగుమతి మాఫియా పైనా సమీక్షించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రేషన్ మాఫియా దొంగలను పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేప థ్యంలో మళ్లీ తాజాగా అధికారులు జూలు విది ల్చారు. విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతు లపై ఈసారి రూటు మార్చి ఏకంగా నౌకలపై కన్నేశారు. ఇందులోభాగంగా దక్షిణాఫ్రికా దేశా నికి బియ్యం ఎగుమతవుతున్న స్టెల్లా ఎల్ పనా మానౌకలో కలెక్టర్ బుధవారం తనిఖీలు చేశారు.
వాస్తవానికి ఇప్పటివరకు బియ్యం అక్రమ ఎగుమతి తనిఖీ అంటే కేవలం పోర్టు, పరిసరా ల్లోని గోదాములే అన్నట్లు అధికారులు వ్యవహ రించారు. కానీ కలెక్టర్ షాన్‌మోహన్ అధికారుల కు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు బోట్లు సిద్ధం చేయించి ఏకంగా 2గంటలకుపైగా సముద్రంలో ప్రయాణించి నౌక వద్దకు వెళ్లడంతో అంతా అవాక్కయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే సముద్రంలో లోడింగ్ జరిగే నౌకవద్దకు అధికారులు వెళ్లడం ఇదే తొలిసారి. మరోపక్క నౌకలో జరిగిన 38వేలటన్నుల బి య్యం లోడింగ్‌ను పరిశీలించారు. ఇందులో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ బియ్యం గతంలో సీజ్ చేసి తిరిగి విడుదల చేసినవి కావడం విశేషం. కాగా సీఎం చంద్ర బా బు ఆదేశాల నేపథ్యంలో వరుసగా రేషన్‌బియ్యం అక్రమాలపై అధికారులు తనిఖీలు కొనసాగిం చాలని నిర్ణయించారు.
మరో నౌకలో..
మరోపక్క దక్షిణాఫ్రికాకు వెళ్తున్న మరో నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన లవన్ షిప్పిం గ్ కంపెనీ బియ్యంపైనా బుధవారం రాత్రి తనిఖీలు చేశారు. ఈ కంపెనీ నౌకలో లోడింగ్ చేయడానికి సిద్ధం చేసిన 1,060మెట్రిక్ టన్ను ల బియ్యం రేషన్ బియ్యంగా గుర్తించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ కంపె నీ గోదాముపై దాడి చేసి 750 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. ఆ తర్వాత బ్యాంకు గ్యారెంటీ తీసుకుని బియ్యాన్ని విడిచి పెట్టేశారు. తిరిగి ఈ బియ్యాన్ని ఆ కంపెనీ దక్షిణాఫ్రికాకు ఎగుమతికి సిద్ధం చేసింది. విడుదల చేసిన రేషన్ బియ్యం 750మెట్రిక్ టన్నులు అయితే బార్జిలో ఎగుమతి కోసం 1,060 మెట్రిక్ టన్నులు ఎలా సిద్ధం చేసిందనే దానిపై అధికారులు ఆరా తీశారు. తీరా అదం తా ఇటీవల సేకరించిన రేషన్ బియ్యంగా గు ర్తించారు. అటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ సైతం మంగళవారం రాత్రి కరపలో కొన్ని గోదాముల్లో తనిఖీలు చేసి రేషన్ బియ్యం అనుమానాలతో కొంత స్టాకును సీజ్ చేశారు. ఇదే గోదాములో జూన్ 8న పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశా రు. రూ.10కోట్ల విలువైన 3,357 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అనుమానంతో మళ్లీ ఇక్కడే తనిఖీలు చేయడం విశేషం. ఇలా వరు సగా అధికారులు నిఘా పెంచడంతో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Updated Date - Nov 28 , 2024 | 12:49 AM