ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అపార్‌ ఐడీ నమోదు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:49 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి అపార్‌ ఐడీ వివరాలను యూడైస్‌ ప్లస్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్‌ భావన ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో కమిషనర్‌ భావన మంగళవారం సమావేశమయ్యారు. ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్‌ ప్లస్‌ విధానంలోకి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని, విద్యా

కాకినాడ కమిషనర్‌ భావన

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి అపార్‌ ఐడీ వివరాలను యూడైస్‌ ప్లస్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్‌ భావన ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో కమిషనర్‌ భావన మంగళవారం సమావేశమయ్యారు. ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్‌ ప్లస్‌ విధానంలోకి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని, విద్యార్థుల సర్వే అపార్‌ ఐడీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్‌ ఐడీ ఉం డాలన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణివ్వడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల విద్యార్హత, విద్యపై సమగ్ర వివరాలను సేకరిస్తుందన్నారు. శుక్రవారం నాటికి కాకినాడ అర్బన్‌ పరిధిలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల అపార్‌ ఐడీని నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌, కాకినాడ డివిజన్‌ ఉప విద్యాశాఖాధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు, కాకినాడ అర్బన్‌ మండల 1,2 విద్యాశాఖాధికారులు ఏఎస్‌కేవీ ప్రేమజ్యోతి, సీహెచ్‌.రవి, ఇంటర్మీడియట్‌ ఎడ్యు కేషన్‌ డీవీఈఓ ఆర్‌.నూకరాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:49 AM