ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై ఎన్‌సీడీ సర్వే
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:28 AM
పెద్దాపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందు కు ప్రభుత్వం ఎన్‌సీడీ 3.0 సర్వేను ప్రారంభించి నట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పి.సరిత తెలపారు. ప్రజల ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలు సుకునేందుకు ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) 3.0 పేరుతో ఈ కార్యక్రమా నికి
డిప్యూటీ డీఎంహెచ్‌వో సరిత
పెద్దాపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందు కు ప్రభుత్వం ఎన్‌సీడీ 3.0 సర్వేను ప్రారంభించి నట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పి.సరిత తెలపారు. ప్రజల ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలు సుకునేందుకు ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) 3.0 పేరుతో ఈ కార్యక్రమా నికి శ్రీకారంచుట్టిందన్నారు. దీనిలో భాగంగా పెద్దాపురం డివిజన్ పరిధిలోని పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో గురువారం ఆరోగ్య సర్వే చేపట్టామన్నారు. క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, బీపీ, మధుమేహం తదితర వ్యాధిగ్రస్థుల గుర్తించేందుకు సర్వే దోహదపడుతుందన్నారు. తొలిసారిగా క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకే ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందన్నారు. నోటి, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్లను గుర్తించనునట్టు చెప్పారు. క్యాన్సర్‌తో పాటు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలు కూడా ఇంటిదగ్గరే చేయనున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైధ్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:29 AM