ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:22 AM

పిఠాపురం రూరల్‌, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు లభిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తె

విరవలో మాట్లాడుతున్న విజయకుమార్‌

జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌

పిఠాపురం రూరల్‌, నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): ఆర్గానిక్‌ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు లభిస్తాయని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తెలిపారు. పిఠాపురం మం డలం విరవలో మంగళవారం పొలంబడి క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్గానిక్‌ పద్ధతిలో వరి సాగు చేసిన రైతులు తమ అనుభవాలను వివరించారు. ఈ పద్ధతిలో దిగుబడులు స్వల్పంగా తగ్గినా మంచి ధర లభిస్తుందని విజయకుమార్‌ చెప్పారు. రైతులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పొలంబడి కార్యక్రమాన్ని సక్రమంగా ఆచరించిన రైతులు గోపు వీరభద్రరావు, మల్యాల అచ్యుతరామయ్య, తమ్మనబోయిన నాగేశ్వరరావును సత్కరించారు. ఏఈవోగా పదోన్నతి పొందిన వీఏఏ రమ్యను అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీ పి.స్వాతి, ఏవో అచ్యుతరామయ్య, ఉద్యానవనశాఖాధికారి శైలజ, ఏఈవో రామకృష్ణ ఉన్నారు.

ఉలిమేశ్వరంలో ‘పొలం పిలుస్తోంది’

పెద్దాపురం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉలిమేశ్వరం గ్రామంలో వ్యవ సాయశాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కా ర్యక్రమం నిర్వహించారు. ఏడీఏ నల్లి దైవ కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రైతుసేవా కేం ద్రాల ద్వారా ధాన్యం కొను గోలు చేయడం జరు గుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రబీ పంట కాలానికి రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తామన్నారు. ఉద్యానశాఖాఽ దికారిణి నూనే సుజాత, ఏవో కొమ్మోజు సంజ య్‌కుమార్‌, పశువైద్యురాలు గంగాభవానీ, ఏఈవో రాగ స్రవంతి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:22 AM