ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘మెరుగైన ఉపాధికి సహకార సంస్థలు కృషి చేయాలి’

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:06 AM

సర్పవరం జంక్షన్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థ ద్వారా మెరుగైన జీవనోపాధి కల్పనతోపాటు నైపుణ్యాభివృద్ధి సాధన దిశగా సహకార సంస్థలు కృషిచేయాలని జిల్లా సహకార అధికారి జి.వెంకటకృష్ణ కోరారు. సోమవారం కాకినాడలోది కాకినాడ కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసై టీలో 71వ అఖిలభారత స

సర్పవరం జంక్షన్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థ ద్వారా మెరుగైన జీవనోపాధి కల్పనతోపాటు నైపుణ్యాభివృద్ధి సాధన దిశగా సహకార సంస్థలు కృషిచేయాలని జిల్లా సహకార అధికారి జి.వెంకటకృష్ణ కోరారు. సోమవారం కాకినాడలోది కాకినాడ కోఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసై టీలో 71వ అఖిలభారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని ‘ఉపాధి కల్పన- నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాల పా త్ర’ అనే అంశంపై కేసీబీఎస్‌ అధ్యక్షుడు కోసూరి శ్రీనివాస సత్యనారాయణమూర్తి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకారంరంగంలో కొనసాగుతోన్న ఎన్నో సంస్థలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. సహకార ఉద్యమస్ఫూర్తితో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరారు. డివిజినల్‌ కోపరేటివ్‌ ఆఫీసర్‌ బీకే దుర్గాప్రసాద్‌ మాట్లాడు తూ సహకారంరంగం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ సీఈవో ఆర్‌వీ నరసింహరావు, కేసీబీఎస్‌ ఉపాధ్యక్షుడు రెడ్డి వీర రాజేంద్రకుమార్‌లు సహకార వ్యవస్థ పాత్రపై వివరించారు. కార్యక్రమంలో కేసీబీఎస్‌ మేనేజర్‌ చీమలకొండ గంగాధరం, డీసీసీబీ జీఎం ప్రవీణ్‌కుమార్‌, ఎ.వెంకటేశ్వరరావు, ముమ్మిడి గోవిం దు, ముత్తా మధు, వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:06 AM