ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటస్థలమిలా..ఆడేదెలా?

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:15 AM

కాకినాడ అర్బన్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏ ఆటల పోటీలు జరగాలన్నా ఇదే పెద్ద క్రీడామైదానం.. మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం, ఆటస్థలాలు.. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌.. నిత్యం వందలాదిమందికి ఆటవిడుపు ఉండే ప్రదేశం.. అదే జిల్లా క్రీడాప్రాథికారసంస్థ క్రీడా

కాకినాడలోని డీఎస్‌ఏ మైదానంలో ఇటీవల వర్షానికి చిత్తడిగా ఉన్న లోతట్టు ప్రాంతం

అతిపెద్ద క్రీడా మైదానంలో వర్షం వస్తే నీట మునకే

జిల్లా క్రీడాప్రాథికారసంస్థ క్రీడాసముదాయంలో అన్నీ సమస్యలే

కాకినాడ అర్బన్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏ ఆటల పోటీలు జరగాలన్నా ఇదే పెద్ద క్రీడామైదానం.. మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం, ఆటస్థలాలు.. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌.. నిత్యం వందలాదిమందికి ఆటవిడుపు ఉండే ప్రదేశం.. అదే జిల్లా క్రీడాప్రాథికారసంస్థ క్రీడా సము దాయం. ఇది జేఎన్టీయూకే సమీపంలోని ఉంది. ఈ క్రీడామైదానం నుంచే జాతీ య, అంతర్జాతీయ క్రీడాకారులు వివి ధ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు.

ముళ్లపొదలు, తుప్పలు పెరిగి..

ఈ ప్రాంగణం ప్రస్తుతం సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. వర్షం వస్తే చాలు ప్రాంగణంలోని ఫు ట్‌బాల్‌ కోర్టు, ఇతర ఆట స్థలాలు నీటమునుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రాంగణ అభివృద్ధికి ఎటు వంటి నిధులు కేటాయించకపోవడంతో ఎక్క డ వేసిన గొంగళి అక్క డే అన్న చందంగా ఉంది. చుట్టూ ముళ్లపొదలు, తుప్పలు పెరిగి నిత్యం వాకింగ్‌ చేసేవారికి ఇబ్బందిగా మారు తోంది. ఇక్కడ వివిధ ప్రాంగణాల్లో ఉదయం 6 నుంచి 9గంటలవరకు సాయంత్రం 4నుంచి 7గంటలవరకు అనుభవజ్ఞులైన శిక్షకులతో 13 రకాల క్రీడల్లో శిక్షణ ఇస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద స్టేడియంల్లో ఇదొకటి. ప్రతినెలా అద్దెలు, ఇతర రూపంలో రూ.6లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇదంతా రాష్ట్ర క్రీడాప్రాథికార సంస్థ ఖాతాకే జమవుతోంది. ఉమ్మ డి జిల్లా నుంచి ఏ క్రీడా పోటీలు జరిగినా ఇక్కడే నిర్వహిస్తారు. ఈ క్రీడాప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధునికీకరించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.

జనవరికల్లా నూతన హంగులు

ప్రస్తుతం క్రీడాప్రాంగణంలో కొన్ని సమస్యలున్నాయి. నవంబరు నెలనుంచి దీనిపై కార్యాచరణ రూపొందించి జనవరికల్లా నూతనంగా అన్ని హంగులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్‌తో చర్చించాం. ఫుట్‌బాల్‌ కోర్టు మెరక చేయడంతోపాటు క్రీడాప్రాంగణంలో సమస్యలు దశలవారీగా దాతల సహాయంతో పరిష్కరించి ఇక్కడకు వచ్చే క్రీడాకారులకు వసతి కూడా ఏర్పాటు చేసేదిశగా ప్రణాళిక తయారు చేస్తున్నాం.

-బి.శ్రీనివాసకుమార్‌, శాప్‌ సీఈవో

Updated Date - Oct 28 , 2024 | 01:15 AM