పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
ABN, Publish Date - Sep 25 , 2024 | 12:23 AM
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రా
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు, వాటి ఉత్పత్తులను నివారించడంతో పాటు వాటిని యువతకు అందకుండా తగిన చర్యలు చేపట్టాలన్నా రు. జాతీయ ఆరోగ్య అజెండాలో భాగంగా పొగాకు విరమణ సేవల ప్రాముఖ్యత చెప్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా పొగాకు నివారణా కేంద్రా న్ని ప్రారంభించారన్నారు. యువత పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సైకియాట్రీ విభాగ అధిపతి డాక్టర్ ఈ.రామచంద్రరావు, సామాజిక వైద్య విద్య విభాగాధిపతి డాక్టర్ పి.సుజాత ఉన్నారు.
Updated Date - Sep 25 , 2024 | 12:23 AM