ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Dec 07 , 2024 | 01:20 AM

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో నూతన మెళకువలను అందిపుచ్చుకుని నిష్ణాతులైన వైద్యనిపుణులుగా తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యచికిత్సను అందించాలని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.లావణ్యకుమారి ఆకాంక్షించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌, రీకనస్ట్రక్టి

కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లావణ్యకుమారి

ప్లాస్టిక్‌ సర్జరీపై రెండోరోజు రాష్ట్రస్థాయి సదస్సు

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వైద్య రంగంలో నూతన మెళకువలను అందిపుచ్చుకుని నిష్ణాతులైన వైద్యనిపుణులుగా తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యచికిత్సను అందించాలని కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.లావణ్యకుమారి ఆకాంక్షించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌, రీకనస్ట్రక్టివ్‌ అండ్‌ ఈస్తటిక్‌ సర్జన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణ(ఏపీఆర్‌ఏఎస్‌సీ ఓన్‌)-2024 ఆధ్వర్యంలో జ రుగుతున్న 21వ యాన్యువల్‌ సదస్సు రెండో రోజైన శుక్రవారం వివేకానంద పార్క్‌ ప్రాంగణంలోని ఫ్యాబిన్‌ కన్వెన్షన్‌ హాల్లో డాక్టర్‌ లావణ్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏపీఆర్‌ఏఎస్‌సీఓన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ డీవీ కృష్ణారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జీజీహెచ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ బి.రత్నభూషణ్‌ ఆధ్వ ర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ఎన్నో నూత న ఆవిష్కరణలకు తెరలేపి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన నైపుణ్యతను, నూతన మెళకువలను క్షుణ్ణంగా తెలుసుకునేలా అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ సర్జరీలో కొత్తపు ంతలు తొక్కుతున్న సాంకేతిక విధానాలను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు. శుక్రవారం జరిగిన సైంటిఫిక్‌ సెషన్‌కు దేశ నలుమూలల నుంచి వచ్చిన నిష్ణాతులైన ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యనిపుణులు వైద్యులు, వైద్యవిద్యార్థులకు నాణ్యమైన వైద్యచికిత్స విధానంపై వివరించారు. సదస్సు అబ్జర్వర్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్‌ ఎంపీఆర్‌ విఠల్‌, డాక్టర్‌ శ్రీనివాసన్‌, ఆర్‌ఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశి, ఫోరెన్సిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఉమామహేశ్వరరావు, సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌, ఏపీఆర్‌ఏఎస్‌సీఓన్‌ ప్యాట్రన్‌ డాక్టర్‌ కె.విష్ణుమూర్తి, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎస్‌. ప్రవీణ్‌, కార్యదర్శి డాక్టర్‌ రాంబాబు పాల్గొన్నారు.

శస్త్రచికిత్సల స్పెషల్‌ బస్సు...2 రోజులు ఇక్కడే

ప్రాథమిక శస్త్ర చికి త్స అంశాలపై వైద్యు లు, వైద్యవిద్యార్థులకు శిక్షణను ఇచ్చేందుకు అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక బస్సు శుక్రవారం కాకినాడ రంగరాయ కళాశాల(ఆర్‌ఎంసీ)కు వచ్చింది. జీజీహెచ్‌, ఆర్‌ఎంసీల్లో వైద్యవిద్యను బోధిస్తున్న వైద్య నిపుణుల పర్యవేక్షణలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు, హౌస్‌సర్జన్‌లకు ఈ బస్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఆధునిక బస్సులో రకరకాల కుట్లకు సంబంధించిన శిక్షణ, లాపరోస్కోపిక్‌ ఆపరేషన్లకు సంబంధించిన శిక్షణ, ముఖ్యంగా పేగుల ఆపరేషన్‌లో ఉపయోగించే స్టాప్లర్‌లు అనే ప్రత్యేక పరికరాలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.లావణ్యకుమారి, ఆర్‌ఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశి ప్రారంభించారు. శుక్ర, శనివారాల్లో ఈ బస్సు ఆర్‌ఎంసీ ప్రాంగణంలో ఉండనున్నట్టు సూపరింటెండెంట్‌ తెలిపారు. సాధారణ, లాపరోస్కోపిక్‌, గైనకాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్‌ సర్జరీల వైద్యులు, వైద్య విద్యార్థులకు శిక్షణ ఇస్తారని చెప్పారు.

Updated Date - Dec 07 , 2024 | 01:20 AM