ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:47 AM

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీ

ఎంపీకి వినతిపత్రం అందజేస్తున్న పట్టురైతులు

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, 2నెలల వ్యవధిలో ఒక్కొక్క రైతుకు రూ.80వేల వరకూ నష్టం జరిగిందని చెప్పారు. దీనిపై విచారణ జరిపించి లోపం ఎక్కడ ఉందో కనుగొనాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. గత నాలుగేళ్లుగా పట్టురైతులకు రావాల్సిన ఇన్సెంటివ్‌ బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా రూ.60కోట్లు ఉండగా, కాకినాడ జిల్లా లో రూ.2కోట్లుకు పైగా ఉన్నాయని వివరించారు. ఈ బకాయిలను తక్షణం చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు పట్టు విక్రయాలు స్థానికం గా జరిగే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యా ణ్‌ దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పట్టురైతులు జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావును కలిసి వినతి అందజేశారు.

Updated Date - Oct 29 , 2024 | 12:47 AM