ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమార్కులపై అష్టదిగ్బందం

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:07 AM

కాకినాడలో వారంతా ఐదేళ్లపాటు ఇష్టమొచ్చినట్లు బరితెగించారు. తమకు ఎదురే లేదని రెచ్చిపోయారు. పేదల బియ్యాన్ని అడ్డంగా బొక్కేసి సముద్రాలు దాటించేశారు. ఆఫ్రికా దేశాల్లో ఆకలిని సొమ్ము చేసుకుని వందలకోట్లు సంపాదించారు. పోర్టు, పౌరసరఫరాలు, రెవెన్యూ అన్ని శాఖలను గుప్పిట పెట్టుకుని అరాచకపర్వం సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొడుతున్న వరుస దెబ్బలకు రేషన్‌ మాఫియా అక్రమార్కులు అల్లాడుతున్నారు. ఎవరికీ కంటపడకుండా సాగిస్తున్న చీకటి దందాను కూకటివేళ్లతో పెకిలిస్తుండడంతో విలవిల్లాడుతున్నారు.

కాకినాడ పోర్టులో ఇటీవల బియ్యం తనిఖీ చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌

  • బద్ధలవుతున్న కాకినాడ రేషన్‌ బియ్యం మాఫియా పునాదులు

  • యథేచ్ఛగా వ్యవహరిస్తూ అడ్డంగా బరితెగించిన అక్రమార్కులపై సర్కారు వేట

  • మాఫియాను అరికట్టడంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం, డిప్యూటీ సీఎం

  • నేడు కేబినేట్‌లోను దీనిపైనే ప్రధానంగా చర్చ: పలు కీలక నిర్ణయాలకు ఛాన్స్‌

  • మరోపక్క పోర్టు లోపల గోదాముల్లో సార్టెక్స్‌ యంత్రాల గుట్టురట్టు

  • రేషన్‌ బియ్యానికి పాలిష్‌ చేసే ఐదు యంత్రాలు ఉండడంపై సర్కారు సీరియస్‌

  • గోదాముల యజమానులపై చర్యలకు ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం

కాకినాడలో వారంతా ఐదేళ్లపాటు ఇష్టమొచ్చినట్లు బరితెగించారు. తమకు ఎదురే లేదని రెచ్చిపోయారు. పేదల బియ్యాన్ని అడ్డంగా బొక్కేసి సముద్రాలు దాటించేశారు. ఆఫ్రికా దేశాల్లో ఆకలిని సొమ్ము చేసుకుని వందలకోట్లు సంపాదించారు. పోర్టు, పౌరసరఫరాలు, రెవెన్యూ అన్ని శాఖలను గుప్పిట పెట్టుకుని అరాచకపర్వం సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొడుతున్న వరుస దెబ్బలకు రేషన్‌ మాఫియా అక్రమార్కులు అల్లాడుతున్నారు. ఎవరికీ కంటపడకుండా సాగిస్తున్న చీకటి దందాను కూకటివేళ్లతో పెకిలిస్తుండడంతో విలవిల్లాడుతున్నారు.

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కొన్నేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న మాఫియాను అరికట్టడానికి రాష్ట్రప్రభుత్వం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో మాఫియా వణుకుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం దీనిపై సుదీర్ఘ చర్చించి మాఫి యా సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రత్యేక సబ్‌కమిటీ నియమించబోతున్నారు. నేడు కేబినేట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అటు పోర్టు లోపల గోదాముల్లో ఐదు సార్టెక్స్‌ యంత్రాలను గుట్టుగా తరలించి రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేస్తోన్న గుట్టును సర్కారు రట్టుచేసింది. గోదాముల యజమానులపై కేసులతోపాటు బాధ్యులపై విచారణకు ఆదేశించింది.

ఎక్కడ చూసినా ఇదే..

కాకినాడ కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత రేషన్‌ బియ్యం ఎగుమతి మాఫియాపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నేళ్లపాటు పేదల బియ్యాన్ని తినేసి ఎగుమతి చేస్తూ కోట్లకు కోట్లు సంపాదించిన ముఠా ఆటకట్టించడానికి వరుస పెట్టి కీలక అడుగులు వేస్తోంది. దీంతో ఇప్పుడు కాకినాడ రేషన్‌బియ్యం మాఫియా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ మాఫియాను అరికట్ట డంపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ సోమవారం భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ఇటీ వల తాను కాకినాడపోర్టులో పర్యటించి రేషన్‌ బియ్యా న్ని గుర్తించడం, మాఫియా ఏస్థాయిలో రెచ్చిపోతోం ది? తెరవెనుక ద్వారంపూడి సహకారం తదితర అం శాలను లోతుగా చర్చించారు. దీన్ని మొత్తం బయట కుతీసి ఇకపై మాఫియా ఆగడానికి ఏం చేయాలనే దానిపై ఇరువురు మాట్లాడారు. మొత్తం బండారం బయటకు లాగడానికి త్వరలో ఓ సబ్‌ కమిటీ వేయా లని నిర్ణయించారు. రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సైతం సోమవారం కాకినాడ పోర్టు, మేరీటైం బోర్డు అధికారులతో చర్చించింది. డీప్‌వాటర్‌ పోర్టు నుంచి సైతం బియ్యం తరలిపోకుండా పర్యవేక్షణకు త్వరలో ఓ ఐపీఎస్‌ స్థాయి అధికారిని నియమించే విషయమై చర్చించింది. తద్వారా రేషన్‌ బియ్యం అనేది పోర్టుల ద్వారా ఎగుమతి చేయకుండా కట్టడి చేసే విషయమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అయింది. ప్రస్తుతం యాంకరేజ్‌ పోర్టులో మాత్రమే బియ్యం తనిఖీకి, ఇత ర భద్రతా వ్యవహారాల పర్యవేక్షణకు అధికారులు ఉ న్నారు. ప్రైవేటు పోర్టులో ప్రభుత్వానికి సంబంధించి ఎవరూలేరు. ఇకపై కొత్తగా ఇక్కడా నిఘా పెరగనుం ది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021 నుంచి 23 వ రకు లక్షల టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది. ఈ సమయంలో కనీసం ప్రభుత్వం తరఫున తనిఖీలు లే వు. ఇకపై కొత్తగా నిఘా మొదలుపెట్టనున్నారు.

ఎంతకు తెగించారో...

కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో ప్రభుత్వ, ప్రైవేటు గోదాములు చాలా ఉన్నాయి. ఎగుమతికి సిద్ధంగా ఉ న్న బియ్యాన్ని ఇక్కడ నిల్వ చేస్తారు. రేషన్‌ మాఫి యా వ్యక్తులు ఏకంగా ఈ ముసుగులో రేషన్‌ బి య్యాన్ని ఈ గోదాముల్లో ఉంచి సార్టెక్స్‌ యంత్రాలను లోపలకు తరలించి రేషన్‌ బియ్యానికి పాలిష్‌ చేసేస్తు న్నారు. అక్కడినుంచి అక్కడికే నౌకలకు లోడింగ్‌ చే సేస్తున్నారు. దీనికి అసలు ఏమాత్రం తనిఖీల భయం ఉండదు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం బయటపెట్టింది. పోర్టులోపల గోదాముల్లో అయిదు సార్టెక్స్‌ యంత్రాలు ఎందుకు ఉన్నాయని పోర్టు అధి కారులను నిలదీసింది. సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పోర్టులోపల గోదా ముల్లో యంత్రాలేవీ ఉండకూడదు. మరి అలాంట ప్పుడు ఇవి లోపలకు ఎలా వచ్చాయి? ఎవరు అను మతించారు? అని నిలదీయడంతో అధికారులు బెంబే లెత్తిపోయారు. అక్రమార్కులకు సహకరిస్తోన్న విష యం బయటపడిపోవడంతో నీళ్లు నమిలారు. దీంతో వీటిని సీజ్‌ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ గోదాముల యజమానులపై నా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. సహక రించిన బాధ్యులపైనా విచారణకు ఆదేశించింది. దీం తో ఇప్పుడు కొందరు అధికారులు రేషన్‌ అక్రమా ర్కులతో తమకున్న సంబంధాలు బయటపడిపోవడం తో వణికిపోతున్నారు. జిల్లాలో గడచిన అయిదేళ్లలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌, అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిపై నమోదైన కేసులను ప్రభుత్వం తిర గదోడుతోంది. వీటిపై విచారణ వేగవంతం చేయాలని సోమవారం రాత్రి కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షలో పోలీసుశాఖను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ పో ర్టులో పర్యటించిన పవన్‌ బార్జిలో రేషన్‌బియ్యాన్ని గుర్తించి సీజ్‌ చేయించారు. ఈ సమయంలో హూ ఈజ్‌ అలీషా... హూ ఈజ్‌ అగర్వాల్‌ అని అధికారు లను ప్రశ్నించారు. అలీషా గురించి పూర్తి నివేదిక పంపాలని కలెక్టర్‌ను శనివారం ఆదేశించారు. దీంతో పూర్తిస్థాయిలో అలీషా చరిత్ర, బియ్యం మాఫియా, వ్యాపారాలతో సంబంధాలపై వివరాలు సేకరించి నివే దికను సోమవారం పంపించారు.

Updated Date - Dec 03 , 2024 | 01:07 AM