కొత్త ఓటర్లుగా చేర్పించాలి : ఆర్డీవో
ABN, Publish Date - Nov 06 , 2024 | 12:36 AM
కాకినాడ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతిఏటా చేపట్టే ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధి
కాకినాడ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతిఏటా చేపట్టే ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి అయిన మల్లిబాబు మంగళవారం కాకినాడలోని ఆర్డీవో కార్యాలయంలో పర్యవేక్షణ అధికారులు, బూత్ స్థాయి అఽధికారులతో ఓటర్ల నమోదు, ఇంటింటా ఓటర్ల సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ ఓటర్ల సర్వే, నమోదు కార్యక్రమం డిసెంబర్ నెలతో ముగిస్తున్న నేపఽథ్యంలో కొత్తగా ఓటర్ల నమోదు ఫారం-6 ద్వారా 2025, జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని కొత్త ఓటర్లుగా చేర్పించాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించి మృతుల ఓట్ల తొలగింపులో ధ్రువీకరణ పత్రం ద్వారా తొలగించాలన్నారు. కాకినాడ రూరల్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్.కళ్యాణ్, పర్యవేక్షణాధి కారులు, బూత్ స్థాయి అఽధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 12:36 AM