ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పాడాలి

ABN, Publish Date - Mar 18 , 2024 | 11:40 PM

కొంగోడు (కరప), మార్చి 18: వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతీ ఒక్క ఓటరు విజ్ఞతతో ఆలోచించి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించాలని కాకినాడ రూరల్‌ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కోరారు. మండలంలో కొంగోడు గ్రామంలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి మేనిఫెస్టోను వివరించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిం

కొంగోడులో ప్రచారం చేస్తున్న నానాజీ, సత్తిబాబు, అనంతలక్ష్మి

టీడీపీ, జనసేన నేతల పిలుపు

కొంగోడు (కరప), మార్చి 18: వైసీపీ దుష్ట పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతీ ఒక్క ఓటరు విజ్ఞతతో ఆలోచించి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని గెలిపించాలని కాకినాడ రూరల్‌ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కోరారు. మండలంలో కొంగోడు గ్రామంలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి మేనిఫెస్టోను వివరించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే తలంపుతోనే కూటమిగా ఏర్పడడం జరిగిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆలోచన విధానాలు రాష్ట్రానికి ఎంతో అవసరమని గుర్తించాలని సూచించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి నానాజీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఇరు పార్టీల నాయకులు గుల్లిపల్లి శ్రీనివాసరావు, చుండ్రు వెంకన్నరాయచౌదరి, కోటగిరి మహేంద్రబాబు, మామిడాల వెంకటేష్‌, తుమ్మలపల్లి మాచరరావు, కర్నాసుల పుష్పరాజు, బండారు మురళి, బోగిరెడ్డి కొండబాబు, గంగాధర్‌, వనుం నారాయణరావు, గండి వెంకటేశ్వరరావు, అప్పనపల్లి నారయ్య ఉన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:40 PM

Advertising
Advertising