ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాకినాడ సాగరతీరంలో ఇండో-యూఎస్‌ఏ నావికాదళ విన్యాసాలు

ABN, Publish Date - Mar 26 , 2024 | 01:17 AM

కాకినాడ సాగరతీరంలో ఈనెల 26 నుంచి 31 వరకు భారత్‌- అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు.

నేటి నుంచి 31 వరకు టైగర్‌ ట్రంప్‌

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌

సర్పవరం జంక్షన్‌, మార్చి 25: కాకినాడ సాగరతీరంలో ఈనెల 26 నుంచి 31 వరకు భారత్‌- అమెరికా దేశాల సంయుక్త నావికా దళ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు. ఇండియా-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ ప్రాంతంలో నిర్వహించనున్న టైగర్‌ ట్రంప్‌ విన్యాసాల ఏర్పాట్లను నావికాఽ దళాల అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ పరిధిలో ఆరు రోజుల పాటు జరిగే టైగర్‌ ట్రంప్‌ విన్యాసాల్లో నేవీ, ఆర్మీలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తాయన్నారు. సంయుక్త విన్యాసాల్లో భారదదేశ రక్షణ దళాలు, యూఎస్‌ రక్షణ బలగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సుమారు 800 మంది వరకు పాల్లొంటారన్నారు. అలాగే యుద్ధనౌకలు, యుద్ధట్యాంకర్లతో, వైమానిక దళాలతో విన్యాసాలు జరుగుతాయన్నారు. దేశ రక్షణ, భారత భూభాగంలో టెర్రరిస్టులు, శత్రువులు సముద్రమార్గాన వచ్చి దాడి చేసినప్పుడు వారిని ఏవిధంగా ఏదుర్కోవాలి, ఉగ్రవాద నిర్మూలన, శత్రుదేశాలతో యుద్ధ సమయంలో చేసే విన్యాసాలు ఇక్కడ నిర్వహిస్తారన్నారు. ప్రతిష్టాత్మక విన్యాసాలు జరిగే సమయంలో మంగళవారం నుంచి ఈనెల 29 వరకు బీచ్‌ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉప్పాడ సెంటర్‌ నుంచి లైట్‌హౌస్‌ వరకు వాహనాలకు అనుమతి లేదన్నారు. అచ్చంపే ట జంక్షన్‌మీదుగా పిఠాపురం వైపు వెళ్లేలాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌డీపీవో హనుమంతరావు, కాకినాడరూరల్‌ సర్కిల్‌ సీఐ కె.శ్రీనివాస్‌, తిమ్మాపురం ఎస్‌ఐ రవీంద్రబాబు, నేవీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 01:17 AM

Advertising
Advertising