ఎన్నికల కౌంటింగ్‌కు సహకరించాలి
ABN, Publish Date - May 25 , 2024 | 12:03 AM
పిఠాపురం, మే 24: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్ని కల కౌంటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ కోరారు. పిఠాపురం ము న్సిపల్ కల్యాణమండపంలో శుక్రవారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ కాకినాడలో ఎన్నికల కౌంటింగ్‌కు అను మతి పొందిన కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు మాత్రమే హాజరు కావాలని సూచించారు. మిగిలిన
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
పిఠాపురం, మే 24: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్ని కల కౌంటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ కోరారు. పిఠాపురం ము న్సిపల్ కల్యాణమండపంలో శుక్రవారం సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ కాకినాడలో ఎన్నికల కౌంటింగ్‌కు అను మతి పొందిన కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు మాత్రమే హాజరు కావాలని సూచించారు. మిగిలిన వారంతా తమ, తమ గ్రామాలు, పట్టణాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు, సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నాయని, నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఒకే చోట ఉండకూడదని, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలపై ఏ వివాదాలు జోలికి పోవద్దని సూచించారు. కాకినాడ జిల్లాలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క విధమైన పరిస్థితి ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఒక్కటే కాదని, జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మం డలం, తుని నియోజకవర్గంలో తొండంగి మం డలాల్లో అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు జరిగాయని చెప్పారు. పోలీసులు ప్రతి గ్రామానికి వెళ్లి అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సమావేశంలో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, పిఠాపురం సీఐ శ్రీని వాస్, సర్కిల్‌లోని ఎస్‌ఐలు మురళీమోహన్, బా లాజీ, గుణశేఖర్ తదితరులున్నారు.
Updated Date - May 25 , 2024 | 12:03 AM