మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు : ఎస్పీ
ABN, Publish Date - Apr 10 , 2024 | 11:46 PM
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 10: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జేఎన్‌టీయూకేలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటూ మూడంచెల భద్ర తా వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ ఆదేశించారు. కాకినాడ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన బ్యా లెట్ బాక్స్‌లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13న ఎన్ని కలు
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 10: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జేఎన్‌టీయూకేలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటూ మూడంచెల భద్ర తా వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ ఆదేశించారు. కాకినాడ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన బ్యా లెట్ బాక్స్‌లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13న ఎన్ని కలు ముగిసిన తర్వాత వివిధప్రాంతాల నుంచి స్ట్రాంగ్ రూమ్‌కి ఈవీఎం బాక్స్‌లను తీసుకు వచ్చే బస్సులకు ఏ ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా జేఎన్‌టీయూకేలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయ ంతో త్వరితగతిన కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రధాన మార్గాలను పరిశీలించిన అనంతరం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఆర్ అదనపు ఎస్పీని ఆదేశించారు. బారికేడ్ల ఏర్పాటు, కేంద్ర సాయుధ ధళాలు, ఇతర సా యుధ దళాల బలగాల పోలీసు సేవలను ఏవిధంగా ఉపయోగించుకోవాలి, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఏఎస్పీ (అడ్మిన్) ఎంజేవీ భాస్కరరావు, ఏఎస్పీ (ఏఆర్) బి.సత్యనారాయణ, ఎస్‌డీపీవో కె.హనుమంతరావు, సర్పవరం ఎస్‌హెచ్‌వో వైఆర్‌కే శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐలు చైతన్యకృష్ణ, రమేష్, టూటౌన్ సీఐ నాగేశ్వరరావు నాయక్ ఉన్నారు.
Updated Date - Apr 10 , 2024 | 11:46 PM