ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా కాపు కార్తీక వనసమారాధన

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:47 AM

తెలగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అమలాపురం గండువీధిలోని డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపం వద్ద బుధవారం కాపు కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు.

అమలాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): తెలగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అమలాపురం గండువీధిలోని డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపం వద్ద బుధవారం కాపు కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆమ్లక వృక్షం వద్ద పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన సభలో బీవీసీ విద్యాసంస్థల అధినేత బోనం కనకయ్య, అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, నల్లా శ్రీధర్‌, నల్లా పవన్‌కుమార్‌ మాట్లాడారు. కాపు పేద విద్యార్థులను అన్నివిధాలా ఆదుకునేందుకు సంఘం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలిచి సంఘ అభివృద్ధికి పాటు పడేందుకు తీర్మానించారు. అనంతరం కార్తీక వన సమారాధన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 15వేల మంది సంఘీయులు వన సమారాధనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌, సీనియర్‌ నాయకుడు ఆకుల రామకృష్ణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నల్లా విష్ణుమూర్తి, చిక్కాల గణేష్‌, నల్లా స్వామి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, కల్వకొలను తాతాజీ, యేడిద శ్రీను, గంధం పల్లంరాజు, అధికారి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:47 AM