ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కరిచర్లగూడెంలో భూకబ్జా

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:23 AM

కరిచర్లగూడెంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన 15 ఎకరాల్లో 70 సెంట్ల భూమిని అక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మగ్బుల్‌ భాష, వేముల నాగరాజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు చేశారు.

గోపాలపురం తహశీల్దార్‌ విద్యాపతికి ఫిర్యాదు అందజేస్తున్న టీడీపీ నాయకులు

  • ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

  • ప్రజా సమస్యల పరిష్కార వేదికలో టీడీపీ నాయకుల ఫిర్యాదు

గోపాలపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కరిచర్లగూడెంలోని పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన 15 ఎకరాల్లో 70 సెంట్ల భూమిని అక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మగ్బుల్‌ భాష, వేముల నాగరాజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. 1984లో సీఎం ఎన్టీ రామారావు పేదలకు ఇళ్ల స్థలాల కోసం పంపిణీకి 166సర్వే నెం బర్‌ 15ఎకరాలు ఒక రైతు వద్ద కొనుగోలు చేసి పేదలకు పం పిణీ చేశారని, వైసీపీ అధికా రంలోకి వచ్చేనాటికి 2ఎకరాలు భూమి మిగిలినట్లు పేర్కొన్నారు. ఆ భూమిలో 70సెంట్లలో సచివాలయం, రైతుభ రోసా కేంద్రానికి కేటా యించి మరో 70సెంట్ల భూమిని సెం టున్నర చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వైసీపీకి చెందిన వ్యక్తి ఆర్డీవో పేరున ఉన్న 70సెంట్ల భూమికి నకిలీ పట్టాలు సృష్టించి ఆన్‌లైన్‌ చేయించుకు న్నారు. అయితే ఆన్‌లైన్‌ చేసే క్రమంలో 70సెంట్ల భూమి ఆ ప్రదే శంలో లేకపోవడంతో 52సెంట్ల భూమిని నమో దు చేయించారని పేర్కొన్నారు. ఆర్డీవో పేరున ఉన్న భూమిని ప్రైవేటు వ్యక్తి ఏ ప్రతిపాదికన ఆన్‌లైన్‌ చేశారో ప్రజలకు తెలియజేయాలని కోరారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టి భూమిని ఆన్‌లైన్‌ చేయించుకున్న వ్యక్తితో పాటు అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 01:24 AM