కేఎఫ్‌సీలో మరుగు నూనె వాడేస్తున్నారు..
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:12 AM
ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు/రెస్టారెంట్లలో మరుగు నూనెను ఎక్కువగా వాడుతున్నారని విజిలెన్స్ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం,ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు/రెస్టారెంట్లలో మరుగు నూనెను ఎక్కువగా వాడుతున్నారని విజిలెన్స్ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వంట నూనెలో టోటల్ పోలార్ కాంపౌండ్స్(టీపీసీ) మీటరు రీడింగు 25ు ఉండా లని.. కానీ రీడింగు ఎక్కువగా ఉంటున్నట్టు తమ తనిఖీల్లో బయట పడుతోం దన్నారు.ఈ విధమైన నూనె వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంద న్నారు. శుక్రవారం కేఎఫ్‌సీ రెస్టారెంట్, పందలపాక అప్పారావు(సత్య పంచ కళ్యాణి) పలావు హోటల్స్‌లో తనిఖీలు చేయగా రెండిటిలోనూ రీడింగు ఎక్కువగానే ఉందన్నారు. ఆహార పదార్థాల నమూనాలను ల్యాబ్‌కి పంపించ డంతో పాటు కేసులు నమోదు చేశామన్నారు.కార్యక్రమంలో ఎస్‌ఐ జగన్నా థరెడ్డి,డీసీటీవో నవీన్‌కుమార్,ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రుక్కయ్య పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 12:12 AM