నరకయాతన నుంచి విముక్తి కల్పించండి
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:28 AM
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లిన మహిళ అక్కడ పడుతున్న బాధలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. నరకయాతన పెడుతున్నారని, తనను స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ కన్నీటిపర్యంతమయ్యింది. పనికి కుదుర్చుకున్న యజమాని చిత్రహింసలకు గురి చేస్తోందని, ఆమె బారినుంచి తనను కాపాడి స్వదేశానికి తీసుకురావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ను వేడుకుంటూ పంపిచిన సెల్ఫీ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాయవరం, సెప్టెంబరు 20: పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లిన మహిళ అక్కడ పడుతున్న బాధలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. నరకయాతన పెడుతున్నారని, తనను స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ కన్నీటిపర్యంతమయ్యింది. పనికి కుదుర్చుకున్న యజమాని చిత్రహింసలకు గురి చేస్తోందని, ఆమె బారినుంచి తనను కాపాడి స్వదేశానికి తీసుకురావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ను వేడుకుంటూ పంపిచిన సెల్ఫీ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన వివాహిత సారఽథి దేవి హేమలత 2023 నవంబర్ నెలలో ఒక మధ్యవర్తి ద్వారా ఉపాధికోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లింది. నెలకు 25 వేల రూపాయలు జీతానికి పనికి కుదిరింది. అయితే యజమానురాలు తనతో పగలు, రాత్రి తేడా లేకుండా వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. గుండె నొప్పిగా ఉందని చెప్పిన ఆసుపత్రిలో చూపించకుండా మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. స్వదేశానికి వెళ్లాలంటే 2.5 లక్షలు కట్టాలని షరతు విధించారని చెబుతుంది. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ తనను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని కోరింది. దీనిపై రాయవరం ఎస్‌ఐ బుజ్జిబాబును వివరణ కోరగా బాధితురాలి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
Updated Date - Sep 21 , 2024 | 12:28 AM