ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోనసీమ జిల్లాలో వరద భయం

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:10 AM

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నీట మునిగాయి.

రావులపాలెంలో వరద

ముంచుకొస్తున్న గోదావరి వరద

జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు

జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ సమీక్ష

కుంగుతున్న గట్లను పరిశీలించిన అధికారులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సెలవు ప్రకటించారు. అమలాపురం పట్టణంతో సహా వివిధ ప్రాంతాల్లోని రహదారులు, గ్రామీణ రహదారులపై నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తపేట మండలంలో 109.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మలికిపురంలో 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల రెండు, మూడు రోజుల్లో జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్‌ సూచించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలోని ప్రధానమైన మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లు పొంగి ప్రవహించడంతో సమీపంలో ఉన్న పంట పొలాలన్నీ జలదిగ్బంధానికి గురై అన్నదాతలకు మరోసారి ఇబ్బందులు తలెత్తాయి. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, జేసీ టి.నిషాంతి, ఆర్డీవోలు, ఇతర జిల్లాస్థాయి అధికారులు వర్షాల వల్ల ముంపునకు గురైన, వరదల ప్రభావానికి లోనవుతున్న గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. ముఖ్యంగా విద్యుత్‌ సమస్యలు సత్వర పరిష్కారానికి ఏపీడీసీఎల్‌ సిబ్బంది చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. భారీ వర్షాలకు ముమ్మిడివరం, రాజోలులోని ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధానికి గురయ్యాయి. కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెం ఆర్టీసీ బస్‌ కాంప్లెక్సు జలదిగ్బంధంలో చిక్కుకుంది.

Updated Date - Sep 05 , 2024 | 01:10 AM

Advertising
Advertising