భూచోళ్లు
ABN, Publish Date - Nov 27 , 2024 | 01:51 AM
గత వైసీపీ ప్రభుత్వ పాపాలతో జిల్లాలో భూవివాదాలు, కబ్జాలపై ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయి. న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తోన్న బాధితుల సంఖ్యను పెంచుతున్నాయి. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు, రీసర్వే పేరుతో భూములు లాగేసుకున్నారని మరికొందరు కూటమి ప్రభుత్వాన్ని భారీగా ఆశ్రయిస్తున్నారు.
జిల్లాలో కుప్పలు తెప్పలుగా భూసమస్యలు, కబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ
కూటమి ప్రభుత్వం వచ్చిన అయిదు నెలల్లో 11,059 అర్జీలు రాక
ఇందులో రీసర్వేతో తలెత్తిన భూవివాదాల ఫిర్యాదులే 8,537
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వ పాపాలతో జిల్లాలో భూవివాదాలు, కబ్జాలపై ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయి. న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తోన్న బాధితుల సంఖ్యను పెంచుతున్నాయి. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు, రీసర్వే పేరుతో భూములు లాగేసుకున్నారని మరికొందరు కూటమి ప్రభుత్వాన్ని భారీగా ఆశ్రయిస్తున్నారు. తిరిగి తమ భూములు తమకు ఇప్పించాలంటూ కుప్పలు తెప్పలుగా పిర్యాదులు అందిస్తున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఈ అయిదునెలల్లో వచ్చిన ఫిర్యాదులు అక్షరాలా 11,059. ఇందులో ఏకంగా 8,537 అర్జీలు జగనన్న భూముల రీసర్వే పేరుతో తమను మోసం చేశారంటూ వచ్చినవే. చెప్పాలంటే గత ప్రభుత్వంలో జిల్లాలో 20 మండలాల్లో 292 గ్రామాల్లో చేపట్టిన భూసర్వే అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచీ పక్కా హద్దులతో కొనసాగుతున్న భూములను సర్వే పేరుతో కలగాపులగం చేసేయడంతో వివాదాలు పెరిగిపోయాయి. మరోపక్క జిల్లా నుంచే అత్యధికంగా భూ కబ్జాలు, సమస్యలపై ఫిర్యాదులు రావడంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టి పెట్టారు. జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచీ పక్కా హద్దులు, రికార్డులతో కొనసా గుతున్న భూములను జగనన్న శాశ్వత భూహక్కు రీసర్వే పేరుతో వివాదాస్పదంగా మార్చేశారు. హడావుడి సర్వే పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి 20 మండలాల్లో 292 గ్రామాల్లో రీ సర్వే చేయించారు. దీంతో అనేక వివాదాలు తలెత్తాయి. భూ యజమానులు లేకుండానే ఇష్టానుసారంగా గ్రామాల్లో అధికా రులు సర్వేలు చేసేశారు. ఫలితంగా వేలాదిమంది భూముల విస్తీ ర్ణం తగ్గిపోయాయి. పాస్‌బుక్‌ల్లో ఉన్న భూమికి బదులు విస్తీర్ణం తగ్గించేసి అధికారులు నివేదికలు సిద్ధం చేసేశారు. అలాగే హద్దు లు మార్చేశారు. తరాలతరబడి వారసత్వంగా వస్తోన్న భూము లను సైతం పక్క సర్వే నెంబర్లలో కలిపేశారు. అసలు లేని పేర్లను సర్వే పేరుతో తెచ్చి కొత్త విస్తీర్ణం సృష్టించేశారు. ఇలా ఒకటికాదు రెండు కాదు వందలాది కొత్త వివాదాలు భూసర్వే పేరుతో తలెత్తాయి. అయితే తమకు జరిగిన అన్యాయంపై బాధి తులు అధికారుల వద్దకు వెళ్లినా కనీసం పట్టించుకోలేదు. ఎక్కడో దేశవిదేశాల్లో ఉంటున్న వారు సైతం రీసర్వే తీరుతో నష్టపోయా రు. ప్రభుత్వం న్యాయం చేస్తేందనే ఆశతో పిర్యాదు ఇచ్చినా కనీ సం పట్టించుకోలేదు. అటు జిల్లా మొత్తం రీసర్వే వేగంగా పూర్తి చేయాలనే ప్రభుత్వ ఒత్తిళ్లతో సమస్యల పరిష్కారంపై అసలు అధికారులు సైతం దృష్టిపెట్టలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది భూసమస్యలతో సతమతమయ్యారు. మరోపక్క పక్కపక్క భూయజమానులు సైతం రీసర్వే తీరుతో కొట్లాడుకున్న పరిస్థితు లు తలెత్తాయి. అనేక సొంత కుటుంబాల్లో సైతం చిచ్చు రేగింది. వీటిపై అప్పట్లో కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి సర్కారు కొలువుదీరడంతో అప్పటి జగన్ సర్కారు బాధి తులు న్యాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం మొదలు పెట్టారు. ఇదికాకుండా అప్పటి ప్రభుత్వంలో తమ భూములను వేర్వేరు భవనాల నిర్మాణం పేరుతోను, ఇళ్ల స్థలాల అవసరాల పేరుతోను అధికారులు లాక్కోవడానికి నోటీసులు ఇచ్చారు. అటు వైసీపీ స్థానిక నేతలు సైతం విలువైన భూములపై కన్నేసి కబ్జా కు ప్రయత్నాలు చేశారు. ఇలా వీటన్నింటిపై ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఈ అయిదునెలల్లో ఏకంగా 11,059 మంది బాధితులు వివిధ భూసమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ,మండల స్థాయి ల్లో గ్రామసభల ద్వారా ఫిర్యాదులు చేశారు. ఇందులో ఒక్క రీ సర్వే పేరుతో తలెత్తిన భూవివాదం కారణంగా నష్టపోయిన తమ కు న్యాయం చేయాలంటూ పెట్టుకున్న అర్జీలు 8,537 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఈ తరహా వెల్లువెత్తిన అర్జీలు జిల్లాలోనే అధికం. రీసర్వే పేరుతో గత జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సృష్టించిన వివాదాలకు ఈ ఫిర్యాదులే తార్కాణమని అధికారులు సైతం చెబుతున్నారు. మరోపక్క ఈతరహా ఫిర్యాదులపై దృష్టిసా రించి సమస్యలు పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం చెబుతోం ది. కానీ సర్వే అధికారులు సర్వే ద్వారా ఈ తప్పిదాలను సరిదిద్దేం దుకు ప్రయత్నిస్తున్నా ఒకపట్టాన తేలడం లేదు. ఒకరికి న్యాయం చేస్తే రీసర్వేలో అడ్డగోలుగా పెరిగిన భూమిని వదులుకోవడానికి ఎదుటి పక్షం అంగీకరించడం లేదు. దీంతో ఫిర్యాదుల పరిష్కారం తలకుమించిన భారంగా మారుతోంది. ఒకరకంగా రీసర్వే చిక్కు లపై వచ్చిన 8,537 ఫిర్యాదుల్లో ఇంతవరకు పరిష్కారమైనవి కేవ లం 712 మాత్రమే. దీన్నిబట్టి గత వైసీపీ సర్కారు పాపాల ఫలి తంగా బాధితులకు న్యాయం చేయడం ఎంతకష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే జిల్లాలో అప్పట్లో రీసర్వే జరిపిన 292 గ్రామాల్లో ఆదరాబాదరగా చేసిన రీసర్వే పూర్తిగా తప్పులతడకగా మారింది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన సర్వే యర్లు సైతం టార్గెట్లను పూర్తిచేయడానికి మమ సర్వేను అనిపించేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా గత ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో మార్చేసిన రికార్డులను సరి చేయడం చాలాకష్టతరంగా మారుతోంది.
ఏంటిది...
రెవెన్యూ, పంచాయతీ, దేవదాయ భూముల ఆక్రమణతోపాటు, సామాన్యుల భూమలు సైతం జిల్లాలో కబ్జాకు గురవు తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యా ణ్ ఇటీవల ఆగ్రహం వ్యక్తంచేశారు. ము ఖ్యంగా కాకినాడ జిల్లా నుంచి ఈ తరహా ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని మరీ ప్రస్తావించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. వాస్తవానికి రీసర్వే ఫిర్యాదులు జిల్లా లో వేలల్లో ఉండడం, వీటిపై అధికారులు పరిష్కారం చూపకపోవడంతో అనేకమం ది బాధితులు అమరావతి వెళ్తున్నారు. అక్కడ టీడీపీ, జనసేన కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్‌సెల్‌లో తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఈవిధంగా స్పందించడం గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని భూవివాదాలు సృష్టిం చిందో చాటుతోంది. పవన్ హెచ్చరికతో కలెక్టర్, ఎస్పీలు భూవివాదాలు, ఫిర్యాదు లపై అప్రమత్తమయ్యారు. ఫిర్యాదులపై ప్రత్యేక సభలు పెడుతున్నారు. రీసర్వే చిక్కులపై స్వయంగానూ సమీక్షిస్తున్నారు.
Updated Date - Nov 27 , 2024 | 01:51 AM