ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాడోపేడో తేల్చుకుంటాం

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:45 AM

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం కలిగించేవిధంగా నిర్ణయాలు తీసుకున్న జీవిత బీమా సంస్థ యాజమాన్య వైఖరిని నిరసి స్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి ఎల్‌ఐసీ డివిజన్‌ కార్యాలయం వద్ద లియాఫి(అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల

ధర్నా చేస్తున్న ఎల్‌ఐసీ ఏజెంట్లు

రాజమహేంద్రవరంలో ఎల్‌ఐసీ ఏజెంట్ల మహాధర్నా

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం కలిగించేవిధంగా నిర్ణయాలు తీసుకున్న జీవిత బీమా సంస్థ యాజమాన్య వైఖరిని నిరసి స్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి ఎల్‌ఐసీ డివిజన్‌ కార్యాలయం వద్ద లియాఫి(అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య) ఆధ్వర్యంలో మహా ధర్నా చేశారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఏజె ంట్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యూనియన్‌ రాజమహేంద్రవరం డివిజన్‌ అధ్యక్షుడు రావుల మాధవరావు మాట్లాడుతూ దేశంలో 14 లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నా రు. పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయన్నారు. ఎల్‌ఐసీ సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉన్న పాలసీలన్నింటిని క్లోజ్‌ చేసి అక్టో బరు 1 నుంచి కొత్త పాలసీలను ప్రవేశ పెట్టార ని.. అందులో ఏజెంట్లకు, కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపర్చడం జరిగింద న్నారు. క్లా బ్యాక్‌ కమిషన్‌ స్ట్రెక్చర్‌రిని మార్చడం, మినిమం బీమా మొత్తం రూ.2 లక్షలకు పెంచ డం, పాలసీల్లో వయోపరిమితిని తగ్గించడం, ప్రీమియం రేట్లు పెంచారని వాటన్నింటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. తాడోపేడో తేల్చుకుంటామన్నా రు. ఈసీ సభ్యుడు మస్తాన్‌ మాట్లాడుతూ తమ హక్కుల సాధనకు ఉద్యమిస్తున్నామని త్వరలో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. మహాధర్నాలో వంగా త్రిమూర్తులు, దొరబాబు, సాంబ మూర్తి, పిండి రెడ్డమ్మ, అరవింద్‌, వేమూరి శ్రీనివాస్‌, వీవీఎస్‌ కృష్ణారావు, గండిబోయిన శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, పాలకొల్లు, రావులపాలెం, అమలాపురం, రాజోలు, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం నుంచి 3వేల ఏజెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 12:45 AM