ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీవిత బీమా వారోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:44 AM

ప్రజల నమ్మకం, ఆదరణ తోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) 68 ఏళ్లుగా విశేష సేవలందిస్తూ ముం దుకు సాగుతుందని సంస్థ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ కె.సంధ్యారాణి అన్నారు. మోరంపూడి జంక్షన్‌ వద్ద గల ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం వారోత్సవాలను ప్రారంభించి సంస్థ పతాకాన్ని ఆవిష్క రించి మాట్లాడారు.

జ్యోతిప్రజ్వలనతో వారోత్సవాలను ప్రారంభిస్తున్న సంధ్యారాణి

రాజమహేంద్రవరం కల్చరల్‌, సెప్టెంబరు 2: ప్రజల నమ్మకం, ఆదరణ తోనే జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) 68 ఏళ్లుగా విశేష సేవలందిస్తూ ముం దుకు సాగుతుందని సంస్థ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ కె.సంధ్యారాణి అన్నారు. మోరంపూడి జంక్షన్‌ వద్ద గల ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం వారోత్సవాలను ప్రారంభించి సంస్థ పతాకాన్ని ఆవిష్క రించి మాట్లాడారు. ఎల్‌ఐసీ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సంస్థగా అభివృద్ధి చెందడానికి పాలసీదారులకు అందిస్తున్న నాణ్యమైన సేవలే కార ణమన్నారు. సౌత్‌ సెంట్రల్‌లో రాజమండ్రి డివిజన్‌ ప్రథమ స్థానంలో నిల వడానికి సహకరించిన ఏజెంట్లు, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, సిబ్బందికి ధన్య వాదాలు తెలిపారు. మార్కెటింగ్‌ మేనేజర్‌ సత్యనారాయణ స్వామి మాట్లా డుతూ త్వరలో అమల్లోకి రానున్న మహిళల ప్రత్యేక ఏజెన్సీలు కూడా సంస్థ అభివృద్ధికి మరింత దోహదపడతాయన్నారు. వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సీఆర్‌ఎం మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కార్య క్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.కోదండరామ్‌, గుబ్బల రాం బాబు, ప్రసాద్‌, సాయి శ్రీనివాస్‌, గన్నయ్య, కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:44 AM

Advertising
Advertising