ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిమితి మేరకే పండించాలి

ABN, Publish Date - Aug 23 , 2024 | 01:06 AM

పొగాకుబోర్లు అనుమతి మేరకే పొగాకు పండించా లని రాజమ హేంద్రవరం పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ జీఎల్‌కే.ప్రసాద్‌ రైతులకు సూచించారు. గురువారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఐదు పొగాకుబోర్డులకు చెందిన రైతు సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

  • 58.25మిలియన్‌ కిలోల ఉత్పత్తికే అనుమతి

  • రాజమహేంద్రవరం పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ ప్రసాద్‌

దేవరపల్లి, ఆగస్టు 22: పొగాకుబోర్లు అనుమతి మేరకే పొగాకు పండించా లని రాజమ హేంద్రవరం పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ జీఎల్‌కే.ప్రసాద్‌ రైతులకు సూచించారు. గురువారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో ఐదు పొగాకుబోర్డులకు చెందిన రైతు సంఘం నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది పొగాకు మార్కెట్‌ ఆశాజన కంగా ఉందని, వచ్చే ఏడాది కూడా ఏ మార్కెట్‌ ఉంటుందో చెప్పలేమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలని సూచించారు. గత ఏడాది అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తి చేసే దేశాలు బ్రెజీల్‌, జింబాబ్వేతోపాటు పలు దేశాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్పత్తి బాగా తగ్గిందని దాని వల్ల మన ప్రాంత పొగాకుకు డిమాండ్‌ పెరిగిందన్నారు. వచ్చే సంవత్సరానికి పొగాకు బోర్డు 58.25మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందన్నారు. పరిమితి కంటే అధికంగా పండిస్తే రైతులు నష్టపోతారన్నారు. ఈ ఏడాది పరిమితికి మంచి ఎక్కువగా పండించిన పొగాకుకు అపరాధ రుసుము లేకుండా వాణిజ్య శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారని వచ్చే ఏడాది ఆ పరిస్థితులు ఉండవని ఎక్కువ పండించే పొగాకుకు అపరాధ రుసుము ఉంటుందని హెచ్చరించారు. రైతులు ఈ ఏడాది పొగాకు ధరలు అధికంగా ఉండడంతో కౌలురైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండించడానికి అధిక కౌలు చెల్లించి భూములు తీసుకుం టున్నారని బ్యారన్ల అద్దెలు కూడా పెంచుకుంటున్నారని, దీని వల్ల ధరల లేకపోతే రైతులు నష్టపోతారని, ఆలోచించి సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ హేమస్మిత, దేవరపలి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల రైతు సంఘం నాయకులు కరుటూరి శ్రీనివాస్‌, గద్దే శేషగిరి రావు, ఇల్లూరి రాంబాబు, పరిమి రాంబాబు, కాకర్ల నంది, కాట్రు సత్య నారాయణ, పిన్నమనేని మధుమోహన్‌, గారపాటి సత్యనారాయణ, దుద్దుకూరి హరిబాబు, సత్రం వెంకట్రావు, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 01:06 AM

Advertising
Advertising
<