ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీలకతీతంగా సిండికేట్‌

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:42 AM

ప్రభుత్వ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. లాబీయింగ్‌లతో రాజకీయ పార్టీలకు అతీతంగా మద్యం వ్యాపారులంతా ఒక్కటై సిండికేట్లకు రూపకల్పన చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని 133 ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 300కు పైగా దరఖాస్తులు దాఖలైనట్టు సమాచారం. రానున్న మూడు రోజుల గడువులో వీటి సంఖ్య మరింత పెరగనుంది.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. లాబీయింగ్‌లతో రాజకీయ పార్టీలకు అతీతంగా మద్యం వ్యాపారులంతా ఒక్కటై సిండికేట్లకు రూపకల్పన చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని 133 ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 300కు పైగా దరఖాస్తులు దాఖలైనట్టు సమాచారం. రానున్న మూడు రోజుల గడువులో వీటి సంఖ్య మరింత పెరగనుంది. టీడీపీ, వైసీపీ, జనసేనతో సహా ఆయా పార్టీల్లో ఉండే కీలక మద్యం వ్యాపారులు రాజకీయాలు పక్కనపెట్టి మద్యం వ్యాపారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కడికక్కడే షాపుల కోసం ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈసారి కోనసీమలోని మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నట్టు సమాచారం. నూతన ప్రభుత్వ మద్యం పాలసీ విధివిధానాల్లో భాగంగా కోనసీమ జిల్లాకు వాస్తవానికి 150 షాపులు రావాల్సినప్పటికీ ప్రభుత్వ మార్గదర్శకాలతో వాటిని కుదించడం వల్ల 133 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ అయింది. దీనిలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి మద్యం షాపులకు అప్లికేషన్స్‌ స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో సుమారు 300 దరఖాస్తులు చేసుకున్నట్టు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సాధనాల కనకదుర్గావరప్రసాద్‌ తెలిపారు. రాజోలు, రామచంద్రపురం, కొత్తపేట, ఆలమూరు, ముమ్మిడివరం, అమలాపురం, స్టేషన్ల పరిధిలో ఈ దరఖాస్తులు అందినట్టు తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనుంది. ఈ నెల 11వ తేదీన శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గల గోదావరి భవన్‌లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్‌ పర్యవేక్షణలో లక్కీడ్రా తీయనున్నట్టు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. మూడు విధానాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లతో పాటు హైబ్రీడ్‌గా కూడా వీటిని స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం షాపుల కోసం దరఖాస్తులు అందుతున్నట్టు సమాచారం. ఈసారి ఎక్కువమంది మద్యం షాపుల కోసం ఎగబడుతున్నట్టు తెలిసింది. దీనిలో భాగంగా షాపులవారీగా వ్యాపారులను సిండికేట్‌ చేసే పనిలో కొందరు పైరవీకారులు సిద్ధమయ్యారు. ఎక్సైజ్‌ స్టేషన్‌లోని సిబ్బందితో ఉండే లాబీయింగ్‌ల నేపథ్యంలో ఈ పైరవీలు భారీగా జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ పర్యవేక్షణలో అమలాపురం నల్లవంతెన వద్ద గల కలెక్టరేట్‌ ప్రాంగణంలోని గోదావరి భవన్‌లో లక్కీ డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్‌శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత 12వ తేదీన లక్కీడ్రా అని భావించినప్పటికీ ఒకరోజు ముందుకు తేదీ మార్చారు. శుక్రవారం లక్కీడ్రాలో ఎంపికైన విజేతలు విజయదశమి రోజున ప్రారంభించుకునేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

Updated Date - Oct 07 , 2024 | 12:42 AM