ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముందడుగు!

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:30 AM

మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రైవేటు మద్యం షాపులు విజయదశమి నుంచి అందు బాటులోకి రానున్నాయి.

నిడదవోలులో బార్‌ వద్ద బైక్‌ల బారులు

9 వరకూ దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలో 125 ప్రైవేటు షాపులు

11న లాటరీ.. 12 నుంచి అమలు

నేతల తీవ్ర ప్రయత్నాలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రైవేటు మద్యం షాపులు విజయదశమి నుంచి అందు బాటులోకి రానున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో నాసిరకం మద్యంతో నలిగిపోయిన మద్యపాన ప్రియులకు కాస్త సాం త్వన కలగనుంది. నాణ్యమైన మద్యం సరసమైన ధరకే గొంతులో పడనుంది.ఈ మేరకు మంగళవారం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి సీహెచ్‌ లావణ్య జిల్లా లైసెన్సింగ్‌ అథారిటీ హోదాలో గజిట్‌ నోటిఫికేషన్‌ని విడుదల చేశారు.

జిల్లాలో 125 షాపులు

జిల్లాలోని ఒక కార్పొరేషన్‌,రెండు మునిసిపాలిటీలు, 18 పంచాయతీలతో కలిపి మొత్తం 125 ప్రైవేటు మద్యం షాపు లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర ఖా స్తు చేసుకోవచ్చు.10న శాఖాపరమైన ప్రక్రియ జరుగుతుంది. 11న రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో కలెక్టర్‌ ప్రశాం తి సమక్షంలో ఉదయం 8 గంటల నుంచి లాటరీ తీస్తా రు. 12న విజయ దశమి నాటి నుంచి కొత్త మద్యం షాపు లు అందుబాటులోకి వస్తాయి.ముందుగా ప్రొవిజనల్‌ లైసెన్సు జారీ చేస్తారు.అనంతరం షాపులను తనిఖీ చేసి నిబంధనల మేరకు ఉంటే రెగ్యులర్‌ లైసెన్స్‌ ఇస్తా రు.ఇక, దరఖాస్తు రుసుం రూ.2లక్షలుగా నిర్ణయించారు.షాపు లాటరీ లో రాకున్నా ఈ డబ్బులను వెనక్కి తిరిగివ్వరు. రాజ మహే ంద్రవరం అర్బన్‌ పరిధిలో 28,రూరల్‌ మండలంలో 11, ఇతర మండలాల్లో 90 షాపులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. లైసె న్సు ఫీజు రెండు నెలలకోసారి చెల్లించే అవకాశాన్ని కల్పించారు.

నేతల పట్టు?

బినామీ పేర్లతో మద్యం దుకాణాలు దక్కించుకొని ఆ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని వైసీపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.జిల్లాలోని వైసీపీ మాజీ ప్రజాప్రతిని ధులు ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఈ వ్యాపారంలో ఎక్కువగా ఉన్నారు. ఆ సామాజికవర్గం జగన్‌కి కొమ్ముకాస్తూ ఉంటుందనేది బహి రంగ రహస్యం.ఈ మేరకు తమకు సహకరించాలంటూ ఇప్పటికే ఎక్సయిజ్‌ శాఖలోని కొందరు అధికారులకు ఇప్పటికే తాయిలాలు ఎరగా చూపుతున్నట్టు చెబుతున్నారు. ఇటీ వల జరిగిన బదిలీల్లో సొమ్ము ల తో మళ్లీ మంచి పోస్టింగ్‌లు పట్టుకున్న ఆ అధికారులు లోపాయికారిగా ఒప్పందాలకు సై అన్నట్టు శాఖావర్గాల్లో ప్ర చారం జరుగుతోంది. మరో వైపు కూటమి నేతలు చాలా మంది మద్యం షాపులను ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు.ఈ మధ్య ఎక్స యిజ్‌ శాఖలో బదిలీలు జరి గాయి.స్టేషన్లు, ప్రాంతాల ప్ర కారం ధరలు నిర్ణ యించి పోస్టింగ్‌లకు సిఫారసు లేఖ లు ఇచ్చారనే ఆరోపణలు ఉ న్నాయి.దీంతో వైసీపీకి అను కూలమైన అధికారులకు కీలక మైన సీట్లు దక్కాయి. సిఫా రసు లేఖలు ఇచ్చే సమ యం లో తాము మద్యం షా పులకు దరఖాస్తు చేస్తామని అమ్మకా లు ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో షాపులు తమకు దక్కేలా సహాయం చేయాలని ‘మాట’ తీసుకున్నట్టు చెబుతున్నారు.

గీత కార్మికులకు మరో నోటిఫికేషన్‌

కల్లుగీత గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దానికి సంబంధించి మరో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ప్ర స్తుతం జిల్లాలో 125 షాపులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అంటే కల్లుగీత కార్మిక వర్గాలకు 12/13 షాపులను కేటాయిం చే అవకాశం ఉంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో షాపులు దక్కని వాళ్లుఆ కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంది.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు ఇక్కడే?

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధిక శాతం మంది ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. రాజమహేంద్రవరం సిటీలోని 1-15, 23, 24, 29-50 డివిజన్లు రాజమహేంద్రవరం నార్త్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌. 16-22, 25-28 డివిజన్లు రాజమహేంద్రవరం సౌత్‌ స్టేషన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సీతానగరం స్టేషన్‌లో కోరుకొండ, సీతానగరం, గోకవరం, కొవ్వూరు స్టేషన్‌లో కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, దేవరపల్లి స్టేషన్‌లో గోపాల పురం, దేవరపల్లి, నల్లజర్ల, నిడదవోలు స్టేషన్‌లో నిడద వోలు, పెరవలి, ఉండ్రాజవరం, రంగంపేట స్టేషన్‌లో అన పర్తి, రంగంపేట, బిక్కవోలు దరఖాస్తులు చేసుకోవచ్చు.

లాటరీ పారదర్శకంగా నిర్వహిస్తాం..

కొత్త మద్యం పాలసీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఆరోపణలకు తావు లేకుండా నిర్వహిస్తాం. దరఖాస్తు తనిఖీ ప్రక్రియ అంతా ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరు గుతుంది. నిబంధనలు పరిశీలించుకొని తగు పత్రాలు, సమాచారాన్ని జత చేసి దరఖాస్తులను సమర్పించాలి. - లావణ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

మందుబాబుల క్యూ

సర్కారు షాపులు మూత..బార్ల వద్ద రద్దీ

నిడదవోలు, అక్టోబరు 1 : ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడడంతో మద్యం ప్రియులంతా బార్లకు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలకు సోమవా రంతో గడువు ముగిసింది. దాంతో పాటు మద్యం దుకాణా ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కాంట్రాక్ట్‌ గడువు ముగిసింది. కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమ ల్లోకి వచ్చే ఆక్టోబరు 12వ తేదీ వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచేలా అనుమతులిచ్చింది. కానీ కొన్నిచోట్ల కాంట్రాక్ట్‌ సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో మంగళ వారం నుంచి జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు బార్ల వద్ద క్యూకట్టారు. దీంతో బార్ల వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి నెలకొంది. నిడదవోలు పట్టణ పరిధిలో మూడు, మండలంలో ఏడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. సోమవారం మొత్తం 7 షాపులు మూతపడ్డాయి. ఇప్పటికే పట్టణంలో మూడు బార్లకు గాను లైసెన్స్‌ ఫీజులు భారమై రెండు మూతపడ్డాయి.ఈ నేపథ్యంలో గణేష్‌చౌక్‌ సెంటరులో మిగిలి ఉన్న ఒకే ఒక్క బార్‌ అండ్‌ రెస్టారెంటు మద్యం ప్రియులతో కళకళలాడింది. బయట పార్కింగ్‌కు సైతం ఖాళీ లేక మద్యం ప్రియులు తమ మోటారు సైకిళ్ళను రోడ్లపై పార్క్‌ చేశారు. సోమవారం ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడగా బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎలాగూ మూసివేస్తారు.ఎక్సైజ్‌ సిబ్బంది గురువారం నుంచి మద్యం షాపులు తెరచి విక్రయాలు సాగిస్తారని సమాచారం. దీం తో మందుబాబు మంగళవారం తెగతాగేశారు. బుధవారం సెలవు కావడంతో బాటిళ్లకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

Updated Date - Oct 02 , 2024 | 12:30 AM