లోడు లారీల బీభత్సం
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:39 AM
రాజానగరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై రాజానగరం-కలవచర్ల జం క్షన్‌లో శుక్రవారం రాత్రి గ్రానైట్ బండరాళ్ల లోడు తో వెళ్తున్న లారీని ఐరన్ లోడుతో వస్తున్న మరో లారీ ఢీకొంది. స్థానికుల వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు నుంచి కాకినాడ పోర్టు కు మూడు బండరా
బండ రాళ్ల లారీని ఢీకొన్న ఐరన్ లోడు లారీ
హైవేపై పడ్డ బండరాళ్లు
నిలిచిన వాహనాల రాకపోకలు
తప్పిన పెను ప్రమాదం
రాజానగరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై రాజానగరం-కలవచర్ల జం క్షన్‌లో శుక్రవారం రాత్రి గ్రానైట్ బండరాళ్ల లోడు తో వెళ్తున్న లారీని ఐరన్ లోడుతో వస్తున్న మరో లారీ ఢీకొంది. స్థానికుల వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు నుంచి కాకినాడ పోర్టు కు మూడు బండరాళ్లతో వెళ్తున్న ట్రాలీ లారీ మార్గమధ్యలో రాజానగరం హైస్కూల్ సమీపం లో ఏడీబీ రోడ్డు వైపుగా మలుపు తిరుగుతోంది. ఈ సమయంలో వైజాగ్ నుంచి ఐరన్ ఊచల లో డుతో రాజమహేంద్రవరం వైపుగా వస్తున్న లారీ.. బండ రాళ్లతో మలుపు తిరుగుతున్న లారీని ఢీకొంది. దీంతో ట్రాలీపై ఉన్న 3 గ్రానైట్ బండ రాళ్లలో 2రాళ్లు హైవేపై పడిపోయి హైవేపై వా హనాలు రాకపోకలు నిలిచి పోయాయి. ఈ ప్ర మాదంలో ఐరన్ ఊచల లోడు లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆటోలో చికిత్స కోసం ఆ సుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాజానగరం ఎస్‌ఐ నాగార్జున సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఏవిధమైన వాహనాలు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ బండ రాళ్లు ఏ వాహనం పడినా ఈ పాటికి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేవనే చెప్పాలి.
లారీలతో రహదారులు ఛిద్రం..
నిబంధనలకు విరుద్ధంగా పరిమితి, పరిమా ణానికి మించి భారీ బండ రాళ్లతో నిత్యం ఈ మార్గంలో లారీలు వెళ్లడం వల్ల రహదారులు కొంతకాలానికే ఛిద్రంగా మారుతున్నాయి. ఈ భారీ బండ రాళ్ల లారీల తాకిడి వల్లే ఏడీబీ రహదారి దారుణంగా తయారైంది.
Updated Date - Nov 30 , 2024 | 12:39 AM