ఓం నమః శివ రుద్రాయ!
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:24 AM
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరి శాయి. భక్తులు వేకువజాము నుంచే పుణ్య స్నా నమాచరించి ఆలయాలకు చేరుకున్నారు. పరమ శివునికి ప్రీతిపాత్రమైన ఆవుపాలు, పలు రకాలైన పండ్ల రసాలు, తేనె, చందనం, చెరుకు రసంతో అభిషేకాలు చేపట్టారు.
శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
భక్తుల కార్తీక పుణ్యస్నానాలు
దేవాలయాల వద్ద పూజలు.. అభిషేకాలు.. దీపారాధన
రాజానగరం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరి శాయి. భక్తులు వేకువజాము నుంచే పుణ్య స్నా నమాచరించి ఆలయాలకు చేరుకున్నారు. పరమ శివునికి ప్రీతిపాత్రమైన ఆవుపాలు, పలు రకాలైన పండ్ల రసాలు, తేనె, చందనం, చెరుకు రసంతో అభిషేకాలు చేపట్టారు. అలాగే ఆలయ ప్రాంగ ణంలో ఉసిరి, జమ్మి, మారేడు తదితర దేవతా వృక్షాలకు పసుపు, కుంకుమలు అర్పించి కార్తీక దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అలాగే అర్చకులకు దీప, సాలగ్రామ, ఉసిరి దీపదానాలు సమర్పించారు. అనేక మంది మహిళలు 108 సార్లు శివాలయ ప్రదర్శనలు చేసి మొక్కు లు తీర్చుకున్నారు. మధ్యా హ్నం నిర్వహించిన కార్తీక అన్నసమారాధనలో భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే చక్రద్వారబంధం, తూర్పుగోన గూడెం, నరేంద్రపురం, నంద రాడ, కానవరం, పల్లకడియం గ్రామాల్లోని శివాలయాల్లో భక్తుల అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
Updated Date - Nov 19 , 2024 | 01:25 AM