ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నవ్వుతూ.. నవ్విస్తూ.. ఉండే సినిమాలు తీస్తా

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:54 AM

నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే సినిమాలు తీస్తానని ఆయ్‌ చిత్ర దర్శకుడు కంచిపల్లి అంజిబాబు తెలిపారు.

మామిడికుదురు, సెప్టెంబరు 8: నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే సినిమాలు తీస్తానని ఆయ్‌ చిత్ర దర్శకుడు కంచిపల్లి అంజిబాబు తెలిపారు. అమలాపురానికి చెందిన ఆయన పాశర్లపూడిలంకకు చెందిన అల్లుడు కావడంతో వినాయకచవితి వేడుకలకు అత్తవారింటికి వచ్చారు. ఆయనను స్థానికులు దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. తమ గ్రామానికి చెందిన అల్లుడు చిత్రపరిశ్రమలో రాణించడం ఆనందకరమన్నారు. ఆహ్లాదాన్ని అందించే చిత్రాలు తీయడం తన కోరిక అని, స్నేహానికి విలువిస్తూ అభిమానులను ఆకట్టుకునే చిత్రాలను తీసి ప్రేక్షకులకు మరింత చేరువయ్యవిధింగా పనిచేస్తానన్నారు. మొదటి చిత్రం ఆయ్‌ విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 12:54 AM

Advertising
Advertising