ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లిక్కర్‌లో ‘లక్కీ డ్రా’ప్స్‌

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:12 AM

జిల్లాలో మందుబాబులను అయిదేళ్ల పాటు అడ్డంగా దోచేసిన జే-బ్రాండ్‌లకు ఇక చెల్లుచీటీయే. అడ్డగోలు బ్రాండ్లకు అడ్డదిడ్డం రేట్లు పిండేసిన రోజుల నుంచి నాణ్యమైన మందు తక్కువ ధరకే ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రాబోతోంది.

మంగళవారం ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ

జిల్లాలో 155 దుకాణాల ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన జారీ

ఈ నెల 9 వరకు ఆనలైన, ఆఫ్‌లైనల్లో దరఖాస్తుల స్వీకరణ

ఆఫ్‌లైన దరఖాస్తులను ఎక్కడికక్కడ ఎక్సైజ్‌ స్టేషన్లలో తీసుకునేలా ఏర్పాట్లు

11న కలెక్టర్‌ సమక్షంలో దుకాణాల వారీగా లాటరీ... ఆ వెంటనే అనుమతులు

జిల్లాలో కేవలం పది దుకాణాలే రూ.55లక్షల ఫీజు కేటగిరీలోకి: మిగిలినవన్నీ రూ.65లక్షలే

కాకినాడ నగరంలో అత్యధికంగా 36 దుకాణాలు

ఈనెల 12 నుంచి కొత్త దుకాణాల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్‌లు అందుబాటులోకి

దరఖాస్తు, లైసెన్సు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.102.85 కోట్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మందుబాబులను అయిదేళ్ల పాటు అడ్డంగా దోచేసిన జే-బ్రాండ్‌లకు ఇక చెల్లుచీటీయే. అడ్డగోలు బ్రాండ్లకు అడ్డదిడ్డం రేట్లు పిండేసిన రోజుల నుంచి నాణ్యమైన మందు తక్కువ ధరకే ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఇన్నాళ్లూ మందుబాబుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి కోట్లకు కోట్లు సంపాదించిన మాఫియాకు చెక్‌ పడబోతోంది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ మంగళవారం మొదలైంది. ఈ నెల 9వ తేదీ వరకు ఎక్సైజ్‌ స్టేషన్లలో ఆయా మండలాల వారీగా దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 11న కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను అనుమతించనున్నారు. జిల్లాలో 155 దుకాణాలకు పదివేల నుంచి 50వేల వరకు జనాభా పరిధి ఉన్నవి పది షాపులే తేలాయి. వీటికి రూ.55 లక్షల ఫీజు నిర్ధారణ కాగా మిగిలిన అన్ని దుకాణాలు రూ.65 లక్షలు కేటగిరీలో వస్తున్నాయి. అత్యధికంగా కాకినాడ కార్పొరేషనలో 36 వైనషాపులు ఏర్పాటవబోతున్నాయి. మరోపక్క జిల్లాలో ఒక్కో మద్యం దుకాణానికి 25వరకు దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

జిల్లాలోని మందుబాబులకు ఐదేళ్ల నరకానికి త్వరలో విముక్తి లభించబోతోంది. మందు తాగాలని నోట్లో చుక్కేసుకుంటే దారుణమైన రుచి, వాసనతో ఇన్నాళ్లుగా మద్యం ప్రియులు పడ్డ బాధలకు ఈ నెల 12 నుంచి మోక్షం కలగబో తోంది. అన్ని రకాల ప్రముఖ బ్రాండ్లు ఇకపై తక్కువ ధరకే దొరకనున్నాయి. మద్యం కొత్త పాలసీ ప్రకారం జిల్లాలో పాత మద్యం దుకాణాలు రద్దు కాగా వాటి స్థానంలో ప్రైవేటు వైనషాపులు ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించి మంగళవారం జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త పాలసీ ప్రకారం జిల్లాలో మొత్తం 171 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో 16 దుకాణాలను కల్లు గీత కార్మికులకు కేటాయించడం కోసం మినహాయించారు. వీటికి మలిదశ కింద త్వరలో నోటిఫికేషన విడుదల కానుంది. వీటిని మినహాయించి మిగిలిన 155 మద్యం దుకాణాలకు జిల్లా ఎక్జైజ్‌ అధికారి కృష్ణకుమారి మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన జారీ చేశారు. ఈనెల 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దుకాణాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి ఆయా ఎక్సైజ్‌ స్టేషన్లలో దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టారు. ఈనెల 9 వరకు ఎవరైనా ఆనలైన, ఆఫ్‌లైన విధానంలో నాన రిఫండ్‌ కింద రూ.2లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను ఈనెల 11న కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్లో కలెక్టర్‌ సమక్షంలో ఒక్కో దుకాణానికి లాటరీ తీయనున్నారు. లాటరీ దక్కించుకున్న వారు ఈ నెల 12 నుంచి కొత్త దుకాణంలో మద్యం విక్రయించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఐదేళ్ల తర్వాత మళ్లీ జిల్లాలో ప్రముఖ బ్రాండ్ల విక్ర యానికి అనుమతులు రావడం, ఐదేళ్లపాటు కొనసాగిన అడ్డగోలు ధరలకు కళ్లెం పడడం, అటు రూ.99కే చీప్‌ లిక్కర్‌ ఇవ్వాలని నిర్ణయించడంతో ఈసారి దుకాణాలకు డిమాండ్‌ భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దుకాణానికి 25వరకు దరఖాస్తులు రావొచ్చని భావిస్తున్నారు. లాటరీ విధానంలో ఎంపిక కావడంతో అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం చాలా మంది ముందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆ కేటగిరీలోకి పది దుకాణాలే...

మండలం యూనిట్‌ ప్రాతిపదికగా తీసుకుని జిల్లాలో 155 దుకాణాల ఏర్పాటుకు జిల్లా ఎక్సైజ్‌ శాఖ గెజిట్‌ నోటిఫికేషన జారీ చేయగా... ఇందులో అత్యధికంగా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో ఏకంగా 36 షాపులు తెరుస్తున్నారు. అయితే దుకాణం లాటరీలో దక్కించుకున్నవారు ఫీజులను ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి పదివేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో లైసెన్సు ఫీజు రూ.50లక్షలు చెల్లించాల్సి ఉంది. 10వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న చోట ఫీజు రూ.55లక్షలు, యాభైవేల నుంచి ఐదు లక్షల జనాభా ఉన్న చోట ఫీజు రూ.65లక్షలు చెల్లించాలి. జిల్లాలో పదివేల లోపు జనాభా ఉన్న గ్రామాలేవీ లేవు. పదివేల నుంచి యాభైవేల వరకు జనాభా కేటగిరీలో ఏలేశ్వరం మండలంలో మూడు, కోటనందూరులో రెండు, ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో మూడు, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో రెండు దుకాణాలు వస్తున్నాయి. మొత్తం 155 షాపుల్లో పది దుకాణాలు మాత్రమే రూ.55లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా, మిగిలిన 145 మద్యం దుకాణాలు రూ.65లక్షల ఫీజు విభాగంలోకి వస్తున్నాయి. తద్వారా 145 దుకాణాల లైసెన్సు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఏడాదికి రూ.94.25కోట్లు రానుంది. అటు రూ.55లక్షల ఫీజు చొప్పున పది దుకాణాల ద్వారా రూ.5.50కోట్లు, 155దుకాణాలకు దరఖాస్తుల ద్వారా రూ.3.10 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమకానుంది. ఇలా మొత్తం అంతా కలిపి రూ.102.85కోట్లు సమకూరనుంది.

లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారిపై అడుగడుగునా నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మార్పీ ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రతి దుకాణంలో రెండు సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. గుడి, బడికి సమీపంలో ఒక్క దుకాణం కూడా ఏర్పాటు కావడానికి వీల్లేదు. దుకాణం దక్కించుకున్న వ్యక్తి మండలంలో నచ్చిన చోట షాపు ఏర్పాటు చేసుకోవచ్చు. పర్మిట్‌రూంలు, బెల్ట్‌షాపు లకు అనుమతి ఇవ్వలేదు. గుట్టుగా నాణ్యత లేని మందు విక్రయించి నట్టు తేలినా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

Updated Date - Oct 02 , 2024 | 12:13 AM