ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెడికల్‌ ఆఫీసర్‌ను వేధించి తిరిగి తప్పుడు ఆరోపణలు

ABN, Publish Date - Jul 27 , 2024 | 01:08 AM

జిల్లా ఫైలేరియా విభాగంలో పనిచేస్తున్న సీని యర్‌ అసిస్టెంట్‌ కె.రాథాకృష్ణ కనిపించకపోవడానికి ఎఫ్‌ఆర్‌టీసీ మెడికల్‌ ఆఫీసర్‌ వేధింపులే కారణమని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నా మని ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పి.రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఆర్‌ పవన్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఏపీపీహెచ్‌సీడీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

కాకినాడ సిటీ, జూలై 26: జిల్లా ఫైలేరియా విభాగంలో పనిచేస్తున్న సీని యర్‌ అసిస్టెంట్‌ కె.రాథాకృష్ణ కనిపించకపోవడానికి ఎఫ్‌ఆర్‌టీసీ మెడికల్‌ ఆఫీసర్‌ వేధింపులే కారణమని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నా మని ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ పి.రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఆర్‌ పవన్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్ర వారం వారు కలెక్టర్‌ను కలిసి ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సదరు మెడికల్‌ ఆఫీసర్‌ను కలిసి తాము విచారించా మని, రాధాకృష్ణ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా ఆ విషయాన్ని డీఎంహె చ్‌వో, ఆర్‌డీల దృష్టికి తెచ్చానని తెలిపారన్నారు. దీనిపై విచారణ అధికారి విచారణచేసి డీఎంహెచ్‌వో, ఆర్‌డీలకు నివేదిక సమర్పించినట్లు వివరించార న్నారు. ఇది జరిగిన తర్వాత రాధాకృష్ణ కనిపించకపోవడంతో దాన్ని ఆసరాగా చేసుకుని తిరిగి బాధితురాలైన వైద్యాధికారిణిపై ఆరోపణలు చేస్తుండడంతో ఆమె ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కానీ వాస్తవానికి ఇబ్బంది పడింది ఆ మహిళా వైద్యాధికారిణే అన్నారు. ఆమెకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోగా తిరిగి ఆమెపై నిందలు మోపుతున్నారన్నారు. ఒక మహిళా అధికారికి పనిచేసే స్థలంలో సరైన భద్రత లేకపోవడంతో మిగిలిన మహిళా అధికారులకు అభద్రతాభావం కలుగుతోందన్నారు. దీన్ని తమ అసోసి యేషన్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌వో లను కలిసి సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కోరామన్నారు. దీనిపై కలెక్టర్‌, డీఎంహెచ్‌వో సానుకూలంగా స్పందించారని ఏపీపీహెచ్‌సీడీఏ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 01:08 AM

Advertising
Advertising
<