ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మైక్రో అబ్జర్వర్స్‌కు ఎన్నికల బాధ్యతలు

ABN, Publish Date - May 07 , 2024 | 01:24 AM

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 342 మంది మైక్రో అబ్జర్వర్స్‌ ఎన్నికలలో బాధ్యతలు నిర్వహించనున్నారని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  • నేడు ఆనం కళాకేంద్రంలో మైక్రో అబ్జర్వర్స్‌ శిక్షణా కార్యక్రమం: కలెక్టర్‌ మాధవీలత

రాజమహేంద్రవరం కల్చరల్‌ మే 6: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని 1577 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 342 మంది మైక్రో అబ్జర్వర్స్‌ ఎన్నికలలో బాధ్యతలు నిర్వహించనున్నారని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్స్‌ నేరుగా ఎన్నికల సాధారణ పరిశీలకులుగా జవాబుదారీతనం కలిగి ఉంటారని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద మౌలిక సదుపాయాలు, పోలింగ్‌ రోజున పోలిం గ్‌ నిర్వహణా వ్యవస్థ తదితర అంశాలపై జిల్లాకు వచ్చిన ఇద్దరు సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.బాల సుబ్రహ్మ ణ్యం, కమల్‌కాంత్‌ సరోఛ్‌ స్వయంగా శిక్షణ అందిస్తారని, అవగాహన కల్పిస్తారని తెలిపారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆ నం కళాకేంద్రంలో మంగళవారం ఉదయం శిక్షణా కార్యక్ర మానికి ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం హాజరైన మైక్రో అబ్జర్వర్స్‌, స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటారని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. సూక్ష్మ పరిశీలకుడు ఎప్పటి కప్పుడు సాధారణ పరిశీలకులు నేరుగా నివేదికలను నివేదిం చాలని, పోలింగ్‌ బూత్‌ స్థితి, తదితర అంశాలపై పోలింగ్‌ ఏజెంట్లు, ఓటర్లు చేసిన ఫిర్యాదులను గమనించి, ఫిర్యాదుల తీవ్రత, స్వభావాన్ని అర్థం చేసుకునే కీలక బాధ్యతలు నిర్వ హించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల విధుల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకం

ఎన్నికల పరిశీలకుడు సుబ్రహ్మణ్యం

దివాన్‌చెరువు, మే6: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవడం పీవోలు, ఏపీవోలు పాత్ర కీలకమైందని సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.సుబ్రహ్మణ్యం అన్నారు. పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం పీవో, ఏపీలకు రెండవ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను ఆర్వో చైత్రవర్షిణితో కలిసి పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రత్యక్షంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిర్వర్తించే పాత్ర కీలకమన్నారు. ఒకటికి రెండు సార్లు పునశ్చరణ చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన అందరిపై ఉన్న వ్యక్తిగత బాధ్యత అన్నారు. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా స్వీప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణా కార్యక్రమం పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీవో బుక్‌లో పేర్కొన్న విధంగా ఎన్నికల విధులు నిర్వహించే క్రమంలో నిబద్దత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆర్వో చైత్రవర్షిణి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమానికి హాజరైన వారంతా తప్పని సరిగా తాము నిర్వహించాల్సిన బాధ్యత, అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు.

Updated Date - May 07 , 2024 | 07:59 AM

Advertising
Advertising