మంత్రి దుర్గేష్ పెద్ద మనసు..
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:08 AM
రోడ్డు ప్రమా దంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని కాపాడి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ పెద్ద మనసు చాటుకు న్నారు.
నిడదవోలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమా దంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని కాపాడి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ పెద్ద మనసు చాటుకు న్నారు. నిడదవోలు మండ లం డి.ముప్ప వరం, మునిపల్లి గ్రామాల మధ్య బైక్‌పై వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రగా యాలపాలయ్యాడు. దీంతో అతన్ని రోడ్డు పక్కనే పడుకోబెట్టి స్థానికులు 108కు ఫోన్ చేస్తున్నారు. అటుగా వెళుతున్న మంత్రి దుర్గేష్ అది గమనించి కాన్వాయ్‌ను ఆపారు.. గాయాలతో ఇబ్బందిపడుతున్నన క్షతగాత్రుడి వివరాలు సేకరించారు. కంగారుపడవద్దు.. నేనున్నానంటూ ధైర్యం చెప్పా రు. మరో పక్క తన సిబ్బందితో అంబులెన్స్‌కు ఫోన్ చేయించి త్వరితగతిన వైద్య సేవలందేలా చర్యలు చేపట్టారు. మరో పక్క మహిళ, చిన్నారులకు తన ఎస్కార్ట్ వాహనంలోనే నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాఽథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు రాజమహేంద్రవరం తరలించాలని ఆదేశించారు.
Updated Date - Nov 18 , 2024 | 01:08 AM