ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

ABN, Publish Date - Nov 09 , 2024 | 01:19 AM

దివాన్‌చెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎంతో విశిష్టత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, సెంటర్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ (కాప్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో నన్నయ ప్రాంగణంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృ

ఆంధ్రప్రదేశ్‌ దిగ్దర్శనం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి దుర్గేశ్‌

రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌

దివాన్‌చెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎంతో విశిష్టత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, సెంటర్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ (కాప్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో నన్నయ ప్రాంగణంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవం సదస్సు శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దుర్గేశ్‌ మాట్లాడుతూ ఆదికవి నన్నయ, టంగుటూరిప్రకాశంపంతులు, కందుకూరి వీరేశలింగం వంటి మహనీయులు రాజమహేంద్రవరంలో నడయాడారని, కోస్తా తీరంనాగరికతకు నెలవు అని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో కళారూపాలు ఉన్నాయని, వాటిని సినిమా వైపు మాత్రమే కాకుండా స్వీయ అభిలాషతో స్వీకరించి ఆదరించాలన్నారు. తెలుగు భాష చాలా ప్రాచీనమైనదని, దాని ఆధారాలను భద్రపరుచుకోవలసిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలన్నారు. సంస్కృతి వైభవం కోసం కృషిచేసే విధంగా ముందడుగు వేయాలన్నారు. చరిత్రను అర్థం చేసుకుంటేనే భవిష్యత్తును నిర్శించుకోగలమన్నారు. నన్నయ విశ్వవిద్యాలయ ం అభివృద్ధికి పూర్తిస్ధాయిలో కృషిచేస్తామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు పాటుపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ దిగ్దర్శనం, ఆంధ్రశక్తి వారి ఈట్‌ టూ ఫీడ్‌ పుస్తకాలను, వీసీ శ్రీనివాసరావు రూపొందించిన జియాలజికల్‌ మ్యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక నిధులు తీసుకువచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాప్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కర్రి రామారెడ్డి, ప్రతినిధి సీహెచ్‌ విజయానంద ఆదిత్య, కన్వీనర్లు ఆచార్య కె.శ్రీరమేష్‌, ఆచార్య డి.జ్యోతిర్మయి పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 01:19 AM