ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి..మరో నామినేషన్ దాఖలు
ABN, Publish Date - Nov 14 , 2024 | 01:09 AM
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు బుధవారం మరో నామినేషన్ దాఖలైంది.
కలెక్టరేట్(కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు బుధవారం మరో నామినేషన్ దాఖలైంది. మంగళవారం మొదటి నామినేషన్ దాఖలు కాగా మరో నామినేషన్‌తో కలిపి ఇప్పటికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.
డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన గంధం నారాయణరావు కాకినా డ కలెక్టరేట్‌లో బుధవారం తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం కాకినాడలోని క్లబ్ ఆవ రణల్లో సమావేశం జరిపారు. ఆయన మాట్లా డుతూ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్య ర్థిగా తనను ప్రజాస్వామికవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్‌టీయూ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు వివిధ ప్రజా సంఘాలు బలపరిచి గెలిపించాలని కోరారు. సభను ద్దేశించి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాసు మాట్లాడుతూ ఎస్టీయూ వల్లే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరిగా యన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపా లని, వారిని రెగ్యు లర్ చేయాలని పోరాటం చేస్తున్నామ న్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఉపాధ్యాయలు అందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, ప్రైవేటు స్కూల్స్ యూనియన్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి, శివ, ప్రసాద్, దొరబాబు, చలపతి పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 01:09 AM