మున్సిపల్ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్షలు
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:53 PM
పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్ ఖాతా
పిఠాపురం, అక్టోబరు 3: సమస్యల పరిష్కారం కోరుతూ పట్టణంలో మున్సిపల్ ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మున్సిపల్ కమిషనరు పరిధిలో ఉన్న పీఎఫ్ ఖాతాలను జీపీఎఫ్ ఖాతాలుగా మార్పు చేసి నిధులు బదిలీ చేయాలని యూ టీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల పోస్టులు అప్‌గ్రేడ్ చే యాలని, ప్రధానోపాధ్యాయుల్లో అర్హులైనవారిని అర్బన్ ఎంఈవోగా నియమించాని, ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించాలని యూటీ ఎఫ్ ప్రతినిధులు కోరారు. దీక్షల్లో టేకుమూడి శ్రీనివాస్, వెంకటరెడ్డి, పాములయ్య, గారపాటి శ్రీను, నరాల శ్రీనివాస్, ఎంవీఎస్ శర్మ, మల్లేశ్వరరావు, కె.శ్రీనివాస్ ఉన్నారు.
సామర్లకోట: మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ యూ టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు సామర్లకోట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు. పట్టణ సంఘ గౌరవాధ్యక్షు డు కెవీవీ.సత్యనారాయణ ఆద్వర్యంలో నిర్వహించిన దీక్షలకు ముఖ్య అతిథిగా జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు కె.నగేష్ హాజరయ్యారు. జిల్లా నాయకులు పి.గిరిధర గోపాల రావు, పట్టణ అధ్యక్షురాలు ఎం.వీరమణి, ఎస్.రాజా, కె.శ్రీనివాస్, సయ్యద్ సైఫుల్లా, ఎం.నాగేశ్వరరావు, జీ.గోవిందు పాల్గొన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈ వో వై.శివరామకృష్ణయ్యకు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు అందజేశారు.
Updated Date - Oct 03 , 2024 | 11:53 PM