ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంచలనం

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:12 AM

రాజకీయ పలుకుబడి... అప్పటి వైసీపీ ప్రభుత్వ అధికార బలంతో హత్య కేసును సైతం నిర్వీర్యం చేసి మరుగున పెట్టించేశారు. నిందితులంతా హ్యాపీగా తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విచారణకు నోచుకోని హత్య కేసులను పునర్విచారణ చేపట్టారు.

మధురైలో పోలీసుల అదుపులో పినిపే శ్రీకాంత్‌

అమలాపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి):రాజకీయ పలుకుబడి... అప్పటి వైసీపీ ప్రభుత్వ అధికార బలంతో హత్య కేసును సైతం నిర్వీర్యం చేసి మరుగున పెట్టించేశారు. నిందితులంతా హ్యాపీగా తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విచారణకు నోచుకోని హత్య కేసులను పునర్విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా అయినవిల్లి గ్రామానికి చెందిన దళితుడైన జనుపల్లే దుర్గాప్రసాద్‌(27) హత్యోదంతం వెలుగుచూసింది. ఈ ఘటనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ హస్తం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూడటం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ హత్యకేసులో ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన యువకుడు, వైసీపీ సోషల్‌ మీడియా మండల కోఆర్డినేటర్‌ వడ్డి ధర్మేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్‌ను తమిళనాడు రాష్ట్రంలోని మధురై సమీపంలో అదుపులోకి తీసుకుని కోనసీమకు పోలీసులు తరలిస్తున్నారు. అయినవిల్లి గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న జనుపల్లే దుర్గాప్రసాద్‌(27) అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జూన్‌ 6, 2022న హత్యకు గురయ్యాడు. ఆ తరువాత మృతదేహం కోటిపల్లి రేవులో ఇసుక తిప్పపై దొరికింది. వలంటీర్‌ దుర్గాప్రసాద్‌ హత్యకేసుపై విచారణ జరపాలని ప్రజాసంఘాలు అప్పట్లో ఆందోళన చేసినప్పటికి వైసీపీ నేతల రాజకీయ పలుకుబడితో కేసును అప్పటి పోలీస్‌ యంత్రాంగం నీరుగార్చి పక్కన పెట్టేసింది. అయితే దుర్గాప్రసాద్‌ భార్య ఆదర్శ విజ్ఞప్తిపై కేసు పునర్విచారణ చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ను కోరడంతో ఆయన పోలీస్‌ ఉన్నతాధికారులకు చేసిన విజ్ఞప్తి మేరకు దుర్గాప్రసాద్‌ హత్యకేసును తిరిగి విచారణ ప్రారంభించారు. దాంతో ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి విశ్వరూప్‌ తనయుడు, వైసీపీ నేత డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ ఉండడం సంచలనం కలిగించింది. ఈ కేసులో శ్రీకాంత్‌ పాత్రే కీలకం కావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేసిన నిందితులు ఆపై ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించారు. కేసులో నిందితుడిగా ఉన్న ధర్మేస్‌ హత్య తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా దుర్గాప్రసాద్‌ భార్య ఆదర్శ ఆమె ఇద్దరి పిల్లలతో పాటు కొందరి యువకులను పోగుచేసి నిందితులను అరెస్టు చేయాలని ఆందోళన చేయడం కొసమెరుపు.. అదే విధంగా ఎవ్వరికి అనుమానం రాకుండా శ్రీకాంత్‌ కూడా ప్రవర్తించాడు. దుర్గాప్రసాద్‌ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయించడంతో పాటు భార్య పిల్లల్ని తీసుకుని ఎస్పీని కలిసి విచారణ చేపట్టాలని కోరినట్లు ధర్మేస్‌ వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. ఈ కేసులో మరికొందరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీకాంత్‌కు అప్పట్లో ఎక్కవ ఫోన్‌కాల్స్‌ చేసిన వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పక్కన పెట్టేసిన దుర్గాప్రసాద్‌ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా వైసీపీ నేత డాక్టర్‌ శ్రీకాంత్‌ ఉండడంతో రాజకీయ దుమారం రేగుతోంది. మధురైలో డాక్టర్‌ శ్రీకాంత్‌ను అరెస్టు చేసిన సమయంలో అతను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాను డాక్టరనని ప్రాణాలు పోయడమే తెలుసు... ప్రాణాలు తీయడం తనకు తెలియదు అని కావాలని కుట్ర చేసి ఈ కేసులో ఇరికించారని శ్రీకాంత్‌ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి విశ్వరూప్‌ కూడా హైదరాబాద్‌లో స్పందించారు. తాను తిరువనంతపురం వెళ్తుండగా ఈ విషయం తెలిసిందని వెంటనే తన కుమారుడిని హైదరాబాద్‌ రమ్మన్నానన్నారు. కోర్టు ముందుగాని, పోలీస్‌స్టేషన్‌లో గాని లొంగిపోవడానికి తాను పిలిపించానని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తన కుమారుడిపై రాజకీయ పలుకుబడితో అక్రమంగా కేసు బనాయించేందుకు కుట్ర చేశారని విశ్వరూప్‌ ఆరోపించారు. జిల్లా పేరు మార్పు సమయంలో తన ఇళ్లకు నిప్పుపెట్టిన కేసుల్లో ఏ-1గా వాసంశెట్టి సుభాష్‌ పేరు ఉందని ఆ కారణంతోనే తన కుమారుడుపై రాజకీయ బురదజల్లే కుట్రలో భాగమే ఈ హత్య కేసని వ్యాఖ్యానించారు. తానేంటో తన కుటుంబం ఏంటో కోనసీమలోని అన్ని వర్గాల ప్రజలకు తెలుసని ఎన్ని కుట్రలు చేసి ఎంత బురదజల్లినా తమకేమి నష్టం లేదని విశ్వరూప్‌ పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు.

Updated Date - Oct 22 , 2024 | 01:12 AM