ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నల్లజర్ల పెట్రోల్‌ బంక్‌లో మోసం

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:41 AM

నల్లజర్ల బస్‌స్టాండ్‌ సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. కవులూరు గ్రా మానికి చెందిన కందుల లోకేశ్‌ శుక్రవారం నల్లజర్లలోని ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌లో రూ.150 పెట్రోల్‌ కొట్టించుకుని అరకిలో మీటరు దూరం వెళ్లేసరికి పెట్రోల్‌ అయిపోయి ఆగిపోయింది.

నల్లజర్ల, ఆగస్టు 23: నల్లజర్ల బస్‌స్టాండ్‌ సమీపంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. కవులూరు గ్రా మానికి చెందిన కందుల లోకేశ్‌ శుక్రవారం నల్లజర్లలోని ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌లో రూ.150 పెట్రోల్‌ కొట్టించుకుని అరకిలో మీటరు దూరం వెళ్లేసరికి పెట్రోల్‌ అయిపోయి ఆగిపోయింది. తిరిగి పెట్రోల్‌ బంక్‌కి వెళ్లి ప్రశ్నించగా.. తమ ఓనర్‌ వచ్చాక మాట్లాడుదువు బండి పక్కన పెట్టు అంటూ పంపు బాయ్‌ దురుసుగా వ్యవహరించడంతో లోకేశ్‌ గ్రామస్థులకు, స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పడంతో సుమారు 200మంది బంకు వద్దకు వచ్చి బంకు మూసి వేయాలని ధర్నా చేశారు. సీసీ కెమెరా చూపించమని డిమాండ్‌ చేయడంతో పంపు బాయ్‌ పంపు రీడింగ్‌ నిలిపి వేసినట్టు రికార్డు అయ్యింది. దీంతో తాము ఇన్నాళ్లుగా చాలా మోసపోయామని అనేక మంది వినియోగదారులు పోలీసులకు, తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాపు చేసి బంకు మూసి వేయకపోతే టెంటు వేసి ధర్నా చేస్తామని వినియోగదారులు పేర్కొంటున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:41 AM

Advertising
Advertising
<