ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా జాతీయ ఉపకార వేతన పరీక్ష

ABN, Publish Date - Dec 09 , 2024 | 12:41 AM

జిల్లాలోని 13 కేంద్రాల్లో ఆదివారం జాతీయ ఉపకార వేతన పరీక్షను నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2815 మందికి గాను 2688 మంది ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు హాజరయ్యారు.

అమలాపురం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 13 కేంద్రాల్లో ఆదివారం జాతీయ ఉపకార వేతన పరీక్షను నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2815 మందికి గాను 2688 మంది ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు హాజరయ్యారు. 127 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఈసీబీ కార్యదర్శి బీర హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం కేంద్రంగా జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో 216 మందికి గాను 199 మంది హాజరుకాగా 17 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా బాలుర ఉన్నత పాఠశాలలో 11 మంది, మహాత్మాగాంధీ మున్సిపల్‌ హైస్కూలులో 13 మంది, కొంకాపల్లి జవహర్‌లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 12 మంది, విద్యానిఽధి ఐఐటీ స్కూల్‌లో 15 మంది, పేరూరు జడ్పీహెచ్‌ఎస్‌లో 15 మంది, కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9 మంది, భాష్యం ఇంగ్లీషు మీడియం స్కూలులో 9 మంది, క్రాంతి భారతి జూనియర్‌ కళాశాలలో ఐదుగురు, వాడపాలెం జడ్పీహెచ్‌ఎస్‌లో ఆరుగురు, రత్నంపేటలో ఐదుగురు, రామచంద్రపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడుగురు, చాకలిపాలెం హైస్కూలులో ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు. ఆయా పరీక్షా కేంద్రాలను ఉప విద్యాశాఖాధికారి గుబ్బల సూర్యప్రకాశం, ఏఎంవో పి.రాంబాబు పర్యవేక్షించారు.

Updated Date - Dec 09 , 2024 | 12:41 AM